అతడి నుంచి అద్భుతాలు చూడబోతానంటున్న బ్రెట్ లీ…!  

brett lee is going to see miracles from him ipl, duai, 13 season, mumbai indians,Brett Lee, austraila - Telugu @brettlee_58, 13 Season, Austraila, Brett Lee, Duai, Ipl, Mumbai Indians

రేపటి నుండే అనగా… సెప్టంబరు 19వ తేదీ నుండి దుబాయ్ వేదికగా IPL పండగ మొదలు కాబోతోంది.13వ సీజన్ ఆరంభానికి రంగం సర్వత్రా సిద్ధమైంది.కరోనా కాలంలో ఇంటి దగ్గర ఖాళీగా వున్న క్రికెట్ అభిమానులకు లభించిన గొప్ప ఉపశమనం ఈ IPL. లాక్ డౌన్ కారణంగా కొంచెం ఆలస్యంగా స్టార్ట్ అయినా.అద్భుతంగా ఉండబోతుందని విశ్లేషకుల అంచనా.

TeluguStop.com - Brett Lee Is Going To See Miracles From Him

ఇకపోతే, గత సంవత్సరం ఫైనల్ లో పోటీ పడ్డ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ టీమ్ ల మధ్య జరిగే మొదటి మ్యాచ్ తో ఈ IPL 13వ సీజన్ మొదలు కాబోతోంది.

ఈ నేపథ్యంలో ఓ వైపు ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇంకో వైపు క్రికెట్ సీజన్ మొదలు కానుండడంతో.గత కొన్ని నెలలుగా ఖాళీగా వున్న క్రికెటర్స్ అందరూ చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు.

TeluguStop.com - అతడి నుంచి అద్భుతాలు చూడబోతానంటున్న బ్రెట్ లీ…-General-Telugu-Telugu Tollywood Photo Image

దుబాయ్ వేదికగా మొదలు కాబోతున్న ఈ సీజన్ లో ఆడే ఆటగాళ్ళపై సీనియర్ ఆటగాళ్ళు గత కొన్ని రోజులుగా తమ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్న విషయం మనకు తెలిసినదే.ఇపుడు తాజాగా.ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ ఓ స్టార్ క్రికెటర్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.“ఈ సారి IPL సీజన్లో రోహిత్ శర్మ నుండి అద్భుతాలు ఆశిస్తున్నాను.” అని అన్నాడు.

సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో చిట్ చాట్ చేసిన బ్రెట్ లీ… “ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ ఆటగాడు ఎవరు?” అనే ప్రశ్నకి పై విధంగా బదులిచ్చాడు.ఈ నేపథ్యంలో “ముంబై ఇండియన్స్ ని ముందుండి నడిపిస్తున్న మిస్టర్ రోహిత్ శర్మ, అటు నాయకుడిగా తనదైన బాధ్యత నిర్వర్తిస్తూనే, ఇటు ఓపెనర్ గా కూడా అత్యధిక పరుగులు రాబట్టడంలో మంచి దిట్ట.” అని చెప్పుకొచ్చాడు.

#13 Season #Mumbai Indians #Austraila #Brett Lee #@BrettLee_58

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Brett Lee Is Going To See Miracles From Him Related Telugu News,Photos/Pics,Images..