పాలిచ్చే తల్లులు సిట్రస్‌ పండ్లు తినొచ్చా? తిన‌కూడ‌దా? తెలుసుకోండి!

సాధార‌ణంగా స్త్రీలు ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు.అనేక ఆరోగ్య నియ‌మాల‌ను పాటిస్తారు.

 Breastfeeding Moms Should Eat Citrus Fruits Or Not?! Breastfeeding Moms, Breastf-TeluguStop.com

కానీ, ప్ర‌స‌వం త‌ర్వాత మాత్రం ఆరోగ్యాన్ని అస్స‌లు ప‌ట్టించుకోరు.అయితే వాస్త‌వానికి ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటారో.

అంత కంటే ఎక్కువ‌గా ప్ర‌స‌వ‌రం త‌ర్వాత కూడా తీసుకోవాలి.ముఖ్యంగా పాలిచ్చే త‌ల్లులు త‌న డైట్‌లో పోష‌కాహారం ఉండేలా చూసుకోవాలి.

పోషకాలతో కూడిన ఆహారం తల్లుల త్వరగా కోలుకోవడానికి, శిశువు ఎదుగుదలకు స‌హాయ‌ప‌డ‌తాయి.

ఇక పాలిచ్చే త‌ల్లుల‌కు మేలు చేసే ఆహారాల్లో సిట్ర‌స్ పండ్లు కూడా ఒక‌టి.

అయితే పాలిచ్చే త‌ల్లులు సిట్ర‌స్ పండ్లును తిన‌కూడ‌ద‌ని చెబుతుంటారు.చాలా మంది దీనిని ఫాలో అవుతుంటారు కూడా.

కానీ, ఇది కేవ‌లం అపోహ మాత్ర‌మే.నిజానికి పాలిచ్చే త‌ల్లుల‌కు సిట్ర‌స్ పండ్లు ఎంతో మేలు చేస్తాయి.

రెగ్యుల‌ర్‌గా ఏదో ఒక సిట్ర‌స్ ఫ్రూట్‌ను డైట్‌లో ఉండేలా చూసుకుంటే.త‌ల్లీ మ‌రియు బిడ్డ ఇద్ద‌రిలోనూ రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి జ‌బ్బుల బారిన ప‌డ‌కుండా ఉంటారు.

అలాగే పాలిచ్చే త‌ల్లులు సిట్ర‌స్ పండ్లు రోజూ తీసుకుంటే.శిశువు యొక్క జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు చురుగ్గా మారుతుంది.ఆపరేషన్ తర్వాత త‌ల్లులు సిట్ర‌స్ ఫ్రూట్స్ తింటే.కుట్టు త్వ‌ర‌గా త‌గ్గుతాయి.

Telugu Benefitscitrus, Moms, Citrus Fruits, Citrusfruits, Collagen, Tips, Improv

గర్భాశయం మ‌ళ్లీ వేగంగా పూర్వ స్థితికి చేరుకుంటుంది.మ‌రియు వాటిలో ఉండే పోష‌క విలువ‌లు త్వ‌ర‌గా కోలుకునేందుకు స‌హాయ‌ప‌డ‌తాయి.

ఇక ప్ర‌స‌వం త‌ర్వాత సిట్ర‌స్ పండ్ల‌ను డైట్‌లో చేర్చుకుంటే గ‌నుక.కొల్లాజెన్‌ ఉత్పత్తి జరిగుతుంది.ఫ‌లితంగా ప్రసవానంతరం తల్లి శరీరంపై పడే స్ట్రెచ్‌ మార్క్స్‌ను మ‌టుమాయం అవుతాయి.అదే స‌మ‌యంలో చ‌ర్మం కూడా ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుతుంది.

అయితే మంచివి క‌దా సిట్ర‌స్ పండ్ల‌ను పాలిచ్చే త‌ల్లులు అతిగా మాత్రం తీసుకోరాదు.అలా చేస్తే అనేక ఇబ్బందుల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube