జాకీతో బ్రేకప్ చేసుకో అంటూ రకుల్ ప్రీత్ కు షాకిచ్చిన నెటిజన్?

అప్పుడప్పుడు అభిమానులు తమ అభిమాన నటీనటులకు తమ మనసులో మాట చెప్పేస్తుంటారు.ముఖ్యంగా నటీనటుల వ్యక్తిగత విషయంలో అభిమానులు బాగా సలహాలు ఇస్తూ ఉంటారు.

 Breakup With Jackie Netizen Comments To Rakul Preet Singh Viral Details,  Rakul-TeluguStop.com

ఎందుకంటే వారిపై చూపించే అభిమానం అటువంటిది కాబట్టి.అయితే తాజాగా రకుల్ ప్రీత్ కి కూడా ఒక అభిమాని సలహా ఇచ్చాడు.

అదేంటంటే ఏకంగా తన బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పమని సలహా ఇవ్వగా ప్రస్తుతం ఇది అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.ఇంతకు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

టాలీవుడ్ నటి పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు, బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా పరిచయం.ఈ ముద్దుగుమ్మ నటనపరంగా మంచి మార్కులు సంపాదించుకుంది.

అందం పరంగా ఎంతో మంది కుర్రాళ్ళను ఆకట్టుకుంది.అలా అతి చిన్న వయసులోనే స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హోదాను అందుకుంది.

తెలుగుతో పాటు హిందీ, కన్నడ సినిమాలలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది.రకుల్ మొదట  కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.ఆ తర్వాత కెరటం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో నటించి ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది.

ఇక ఈ సినిమా తర్వాత వరుసగా బాగా అవకాశాలు అందుతుంది.

అలా వెనుకకు తిరిగి చూడకుండా బాగా పరుగులు తీసింది.చాలావరకు స్టార్ హీరోల సరసన నటించింది.ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీని దూరం పెట్టి బాలీవుడ్ వైపు దృష్టి పెట్టింది.

అక్కడ వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.ఇక ఈ ముద్దుగుమ్మ చాలావరకు తన వ్యక్తిగత విషయంలో బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.

ఇక ఈ బ్యూటీ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానితో రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే.అంతేకాకుండా వీరిద్దరి త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు కూడా తెలిసింది.

ఇక సోషల్ మీడియాలో మాత్రం.తను షేర్ చేసుకునే ఫోటో షూట్ ద్వారా బాగా ట్రోల్స్ ఎదురుకుంటుంది.

ఎందుకంటే తను తీసుకునే ఫోటో షూట్ లు అలా ఉంటాయి కాబట్టి.గతంలో బొద్దుగా ఉండే రకుల్ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగటానికి బాగా సన్నబడింది.

ఎంతలా అంటే తన ఎముకలు కనిపించే అంత అని చెప్పవచ్చు.

నిజానికి బొద్దుగా ఉన్నప్పుడే ఈ ముద్దుగుమ్మ చాలా అందంగా కనిపించేది.కానీ ఎప్పుడైతే సన్నబడిందో అప్పటినుంచి తన ఫేస్ కూడా చూడటానికి చాలా ఘోరంగా కనిపిస్తుంది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది.

ఇక ఆ ఫోటోలో కూడా గ్లామర్ షో చేసింది.ఇక ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ గా మారగా తన అభిమానులు ఆ ఫోటోలకు బాగా లైక్స్ కొడుతున్నారు.

అభిమాని మాత్రం ఫన్నీగా తను చేసిన పనుల గురించి మెసేజ్ పెట్టి చివర్లో జాకీతో బ్రేకప్ చేసుకో అంటూ షాక్ ఇచ్చారు.ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ అవుతుంది.

Netizens Suggests Rakul Preet to Breakup with Jackky Bhagnani

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube