బ్రేక‌ప్ ల‌వ్ స్టోరీ..! ఒక‌ప్పుడు ఆమే నా ప్ర‌పంచం...మ‌రిప్పుడు.!?

ఒక‌ప్పుడు ఆమే నా ప్ర‌పంచం.ఆమె నా బెస్ట్ ఫ్రెండ్‌.

 Breakup Love Story-TeluguStop.com

ఆమె నా ప్రియురాలు.క‌ట్ చేస్తే ఇప్పుడామె నా మాజీ ప్రియురాలు.

మేమిద్ద‌రం 3 సంవ‌త్స‌రాల నుంచి ప్రేమించుకుంటున్నాం.ఆమెపై నాకు బాగా న‌మ్మ‌కం ఉండేది.

ఆమెను నేను ఎంత‌గా ప్రేమించానో నాకు త‌ప్ప ఆమెకు తెలియ‌దు.నా ప్రేమ‌కు అంతులేదు.

అనంత‌మైన ప్రేమ నాకు ఆమెపై ఉండేది.అయితే అందుకు నాకు ఆమె ఇచ్చిన బ‌హుమానం ఏమిటో తెలుసా.? అబ‌ద్దాలు చెప్ప‌డం, చీటింగ్ చేయ‌డం.!

3 సంవ‌త్సరాల నుంచి మేం రిలేష‌న్‌షిప్‌లో ఉన్నాం.ఆమె నాతో ఎప్పుడూ చెబుతూ ఉండేది.త‌న‌కు చీటింగ్ చేయ‌డం అంటే న‌చ్చ‌ద‌ని, న‌న్ను త‌ప్ప ఇంకెవ‌రినీ ప్రేమించ‌డం లేద‌ని, ఒక‌రి క‌న్నా ఎక్కువ మందితో రిలేష‌న్ షిప్‌లో ఉండడం అంటే త‌న‌కు న‌చ్చ‌ద‌ని, అలాంటి ప‌నులు చేసేవారంటే త‌న‌కు అస‌హ్య‌మ‌ని ఆమె నాతో ఎప్పుడూ చెబుతూ ఉండేది.

అయితే ఆమెకు ఈ మ‌ధ్యే ఓ వ్య‌క్తి కాలేజీలో పరిచ‌యం అయ్యాడు.నాకు తెలిసి వారిద్ద‌రికీ ప‌రిచయం అయి ఏడాది కూడా కాలేద‌నిపించింది.కానీ ఆమె అత‌నితో ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.దీంతో ఒక‌సారి ఆమె నాతో.

మ‌న‌మిద్ద‌రం మంచి స్నేహితులుగా ఉందామంది.నాకు మాట‌లు రాలేదు.

ఆ త‌రువాత ఆమె నన్ను ఎప్పుడు క‌లిసినా ఆ వ్య‌క్తి గురించే నా ద‌గ్గ‌ర చెప్పేది.అత‌ని గుణ గ‌ణాల‌ను, ఇత‌ర వివ‌రాల‌ను నేను అడ‌గ‌కున్నా నాకు చెప్పేది.

దీంతో నాకు అర్థ‌మైంది.ఆమె న‌న్ను బ్యాక‌ప్‌గా పెట్టుకుంద‌ని.

ఇంకా అత‌నికి ఐ ల‌వ్ యూ చెప్ప‌లేదు.ఒక వేళ అత‌ను రిజెక్ట్ చేస్తే నాతో ఉండిపోవ‌చ్చ‌ని ఆమె భావ‌న‌.

అందుకే ఆమె అత‌న్ని ఇంప్రెస్ చేస్తున్న‌ట్లు నాకు క‌నిపించేది.దీంతో నేనే ఆమెకు బ్రేకప్ చెప్పా.

వాట్సాప్‌లో ఆమెకు నా చివ‌రి మెసేజ్ పంపా.ఒకేసారి ఇద్ద‌రితో రిలేష‌న్‌షిప్‌లో ఉండ‌డం న‌చ్చ‌ద‌ని అన్నావు, మ‌రి ఈ ప‌ని ఎలా చేస్తున్నావు, నీ విష‌యం నాకు తెలిసింది, నువ్వు కోరుకున్న వ్య‌క్తితోనే నువ్వు ఉండు… అంటూ నేను ఆమెకు వాట్సాప్ మెసేజ్ పెట్టా.

ఆ త‌రువాత ఇక‌పై ఆమెను నేను క‌ల‌వ‌లేదు.కానీ ఆమెతో బ్రేకప్ అయిన రోజు మాత్రం ఎంత ఏడ్చానో నాకు తెలియ‌దు.

అలా ఏడూస్తూనే అమ్మ ద‌గ్గ‌ర‌కు వెళ్లా.ఆమె నాతో ఒక్క‌టే చెప్పింది.అన్నీ మ‌రిచిపోయి.కెరీర్‌పై దృష్టి పెట్ట‌మ‌ని అమ్మ నాకు చెప్పింది.నువ్వు ఎంత బాగా జీవిస్తే ఆమెపై అంత స్థాయిలో రివేంజ్ తీర్చుకున్న‌ట్లు అవుతుంద‌ని అమ్మ నాతో అంది.అమ్మ నా క‌న్నీళ్ల‌ను తుడిచింది.

అంత‌కు ముందు వ‌ర‌కు ఎప్పుడూ అమ్మ ద‌గ్గ‌ర నేను ఏడ్వ‌లేదు.కానీ ఆ యువ‌తి విష‌యంలో మాత్రం అమ్మ‌కు జ‌రిగింది చెప్పేశా.

దీంతో నాకు దుఃఖం ఆగలేదు.అమ్మ ఒక పిజ్జా ఆర్డ‌ర్ చేసి నాలో సంతోషం నింపింది.

ఇక ఆ యువ‌తి నా దృష్టిలో చ‌నిపోయిన వ్య‌క్తితో స‌మానం.ఆ రోజు నాకు క‌లిగిన బాధ‌, అమ్మ ముందు ఏడ్చిన ఏడుపు నా జీవితంలో మ‌రిచిపోలేను.

ఆ రోజు ఎందుకో న‌న్ను నేను కంట్రోల్ చేసుకోలేక‌పోయా.!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube