టాలీవుడ్ నటి, నాగబాబు కూతురు నిహారిక కొణిదెల గురించి అందరికీ పరిచయమే.మెగా ఫ్యామిలీ నుండి తొలి హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.
అలా పలు సినిమాలలో నటించింది.కానీ తను అంత సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది.
దాంతో అవకాశాలు కూడా తగ్గిపోయాయి.ఇక ఈ మధ్య ఎక్కువగా వెబ్ సిరీస్ లపై బాగా దృష్టి పెట్టింది.
సోషల్ మీడియా ద్వారా తన పరిచయాన్ని మరింత ఎక్కువగా పెంచుకుంటుంది.ఇదిలా ఉంటే నిహారిక ఇంట్లో అర్ధరాత్రి గొడవ పైగా పోలీసుల ఎంట్రీ కూడా ఉంది.
గత ఏడాది జొన్నలగడ్డ చైతన్యను కుటుంబ సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఇక పెళ్లి తర్వాత నిహారిక లో వచ్చిన మార్పు మాత్రం అంతా ఇంతా కాదు.
గ్లామర్ విషయంలో కూడా ఏకంగా డోస్ ను పెంచేసింది.పొట్టి పొట్టి బట్టలతో బాగా రెచ్చిపోతుంది.
అంతేకాకుండా ఫోటో షూట్ లతో బిజీగా ఉంటూ తన భర్త చైతన్యతో దిగిన ఫోటోలను కూడా బాగా పంచుకుంటుంది.ఇక నిహారిక ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ లో బాగా బిజీ గా ఉంది.
ఇదిలా ఉంటే నిహారిక ఇంట్లో తాజాగా షాకింగ్ న్యూస్ బయటపడింది.దాంతో ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.నిహారిక వాళ్ళ ఇంట్లో అర్థ రాత్రి సమయంలో పెద్ద గొడవ జరిగిందని దాంతో తన భర్త చైతన్య న్యూసెన్స్ చేస్తున్నాడని అపార్ట్మెంట్ వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దాంతో చైతన్య కూడా అపార్ట్మెంట్ వాళ్లపై తిరిగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దీంతో ప్రస్తుతం నిహారిక కుటుంబం కు అపార్ట్మెంట్ వాసులకు మధ్య పోలీసులు విచారణ జరుపుతున్నారు అని తెలుస్తుంది.
దీంతో అసలు ఏమి జరిగిందని అందరూ తెగ ప్రశ్నలు వేస్తున్నారు.ప్రస్తుతం ఈ టాపిక్ గురించి మెగా ఫ్యామిలీలో కూడా బాగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.