బ్రేకింగ్: నిమ్మగడ్డకు మళ్లీ కోర్టులో చుక్కెదురు..!!

ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ హటాత్తుగా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయటం ఇటీవల హైకోర్టు దాన్ని కొట్టేయడం అందరికీ తెలిసిందే.ప్రభుత్వ సిబ్బంది అందుబాటులో లేని తరుణంలో మరోపక్క కరోనా వ్యాక్సిన్ కేంద్రం పంపిణీ చేయాల్సి ఉంటుందని రాష్ట్రాలకు ఆదేశాలు ఇస్తున్న ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ పట్టుపట్టడం దాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం కోర్టుకు వెళ్లడంతో.

నిమ్మగడ్డ రిలీజ్ చేసిన ఎన్నికల నోటిఫికేషన్ హై కోర్టు కొట్టివేయడం అందరికీ తెలిసిందే.

Telugu Nimagaddaramesh, Ysrcp-Telugu Political News

అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హౌస్ మోషన్ పిటిషన్ వేసిన నిమ్మగడ్డకు తాజాగా మరోసారి కోర్టులో చుక్కెదురైంది.ఎన్నికల షెడ్యూల్ రద్దుపై అత్యవసర విచారణ అవసరం లేదని డివిజన్ బెంచ్ తెలపటంతో నిమ్మగడ్డ కు మరో ఎదురు దెబ్బ తగిలినట్లయింది.రెగ్యులర్ కోర్టులో ఈ నెల 18వ తారీకున విచారణ చేద్దామని హైకోర్టు నిమ్మగడ్డ వేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై తీర్పు ఇవ్వడం జరిగింది.

ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలులో ఉందని, ఎలక్ట్రోరల్ లిస్ట్ కూడా ఆగిపోతుందని స్టేట్ ఎన్నికల కమిషన్ కోర్టుకు తెలిపిన గాని వాటిని పట్టించుకోకుండా.కోర్టు తీర్పు ఇవ్వడంతో నిమ్మగడ్డ కు మరో దెబ్బ న్యాయస్థానంలో తగిలినట్లయింది అని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.

మరోపక్క మార్చి 31 వ తారీకు వరకు మాత్రమే నిమ్మగడ్డ కి పదవి ఉండటంతో ఆయనకు అందుకే అంత తొందరపాటు అని, ఏదో విధంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని.టీడీపీకి లబ్ధి చేకూర్చాలని ఆయన యొక్క తపన అని వైసీపీ నేతలు వెటకారం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube