ఇటీవల మంత్రి కొడాలి నాని ఎన్టీఆర్ వర్ధంతి నాడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా దీక్షకు పిలుపునివ్వటం మనకందరికీ తెలిసిందే.కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ దేవినేని ఉమా కౌంటర్లు వేస్తూ విజయవాడ నడిబొడ్డులో దీక్షకు దిగుతారు నువ్వు గానీ, మీ ముఖ్యమంత్రి గానీ ఏం చేస్తారో చూస్తా అంటూ కొడాలి నానికి సవాల్ చేసి ఈరోజు విజయవాడ శివారు గొల్లపూడి సెంటర్ లో దీక్షకు కూర్చోడానికి దేవినేని ఉమా రెడీ అవటంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఈ క్రమంలో కరోనా వైరస్ నిబంధనలకు విరుద్ధంగా దీక్ష చేస్తున్నారంటూ అనుమతులు లేవని పోలీసులు ఎంటర్ అయి దేవినేని ఉమా ని అరెస్టు చేశారు.అరెస్టు చేసి ఉమా ని పోలీసులు వాహనం ఎక్కించడం జరిగింది.
అయితే ఆయనను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అన్నదానం విషయంలో స్పష్టత లేకపోవడంతో.వెంటనే వాహనాన్ని అడ్డుకున్నారు టిడిపి పార్టీ కార్యకర్తలు.
దీంతో గొల్లపూడి సెంటర్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.వెంటనే పోలీస్ భారీ బలగాలు అక్కడ మోహరించడం తో పాటుగా ముందస్తుగా చుట్టుప్రక్కల ప్రాంతాల టిడిపి నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
.