బ్రేకింగ్: ఇండియా కరోనా వ్యాక్సిన్ కంపెనీ లో భారీ అగ్నిప్రమాదం..!!

ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన కరోనా వైరస్ విరుగుడు కరోనా టీకా చాలా దేశాలలో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.అయితే అన్ని దేశాల్లో కంటే భారత్ లో జనవరి 16 వ తారీఖున రిలీజ్ అయిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ పనితనం అదరగొట్టడంతో ప్రపంచ దేశాలు ఇండియా కరోనా వ్యాక్సిన్ తమ తమ దేశాలలో అందుబాటులోకి తీసుకురావడానికి భారీగా ఆర్డర్లు చేస్తూ ఉన్నాయి.

 Breaking Massive Fire In India Corona Vaccine Company, Corona Virus,corona Vacci-TeluguStop.com

దీంతో కరోనా వ్యాక్సిన్ తయారీదారు సంస్థ అయిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కేంద్రంలో ఆక్స్ఫర్డ్ ఆస్ట్రా జెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ భారీగా ఉత్పత్తి అవుతున్న సంగతి తెలిసిందే.ఇటువంటి తరుణంలో సీరం ఇన్స్టిట్యూట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవటం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

పూర్తి విషయంలోకి వెళితే ఇండియా కరోనా వ్యాక్సిన్ తయారయ్యే పూణేలోని సీరం సంస్థ మాంజ్రీ ప్లాంట్లోని టెర్మినల్-1 గేట్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

అతి తక్కువ టైమ్ లోనే ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోయింది.

దీంతో వెంటనే సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది రావటంతో మంటలను అదుపు చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే ఎందువల్ల మంటలు చెలరేగాయి అన్న దాని విషయంలో ఇంకా కారణాలు బయటపడలేదు.

మరోపక్క ఊపిరిపీల్చుకున్నే వార్త ఏమిటంటే కోవీషీల్డ్ టీకాలు ఈ ప్రాంతంలో తయారు కావడం లేదని చెప్పుకొస్తున్నారు.కానీ అక్కడ పరిస్థితి చూస్తే ఐదు అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపు చేయడానికి రంగంలోకి దిగిన గాని ఇంకా మంటలు చెలరేగుతున్నాయి అనే టాక్ వస్తోంది.

దీంతో మరిన్ని అగ్నిమాపక యంత్రాలను రప్పించడం జరిగినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube