బ్రేకింగ్ : అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం !  

Annapurna Studio, nagarjuna , big boss, hyderabad, fire aacident - Telugu Annapurna Studio, Big Boss, Fire Aacident, Hyderabad, Nagarjuna

హైదరాబాద్ లో ఉన్న అక్కినేని కుటుంబానికి చెందిన ప్రముఖ స్టూడియో అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.ఈ రోజు ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.

TeluguStop.com - Breaking Fire At Annapurna Studio

దీనితో కొంత సమయానికే అన్నపూర్ణ స్టూడియోలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.

దీనితో ఈ సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలని అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించి , చివరికి మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు.

TeluguStop.com - బ్రేకింగ్ : అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

మంటల్ని అదుపులోకి తీసుకురావటమ్ తో యాజమాన్యం ఊపిరిపీల్చుకుంది.ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్టూడియో యాజమాన్యం వెల్లడించింది.

ఓ మూవీ షూటింగ్‌ కోసం వేసిన సెట్‌ లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు సమాచారం.అయితే , ఈ అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగలేదని తెలుస్తోంది.

అగ్ని ప్రమాదం నేపథ్యంలో అన్నపూర్ణ సెవన్‌ ఏకర్స్‌ స్టూడియోలో బిగ్‌బాస్‌ షూటింగ్‌ జరుగుతుండటంతో కొంత ఆందోళన నెలకొంది.అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతానికి కుడివైపున బిగ్‌బాస్‌ హౌజ్‌ ఉంటుంది.

అయితే ,మంటలు అదుపులోకి రావడంతో బిగ్‌బాస్‌ నిర్వహణకు ప్రమాదమేమీ లేదని సమాచారం.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలేంటి అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

కాగా, టాలీవుడ్ సీనియర్ హీరో , కింగ్ నాగార్జున ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ ‌కు యాజమానిగా వ్యవహరిస్తున్నారు.అన్నపూర్ణ స్టూడియోస్‌ లో సినిమాలతో పాటు అనేక సీరియల్స్ కి సంబంధించిన షూటింగ్ కూడా జరుగుతుంది.

రియాలిటీ షో, ప్రోగ్రామ్స్ షూటింగ్ సైతం ఇక్కడ జరుపుతుంటారని తెలిసిందే.

#Big Boss #Hyderabad #Nagarjuna #Fire Aacident

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Breaking Fire At Annapurna Studio Related Telugu News,Photos/Pics,Images..