ఫ్యాన్స్ కారణంగా 'సర్కారు' షూటింగ్ ఆపేసారు..ఎందుకంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రెసెంట్ సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.కరోనా కారణంగా చాలా రోజుల పాటు నిలిచి పోయిన షూటింగ్ ఈ మధ్యనే స్టార్ట్ అయ్యి ఎటువంటి అడ్డంకులు లేకుండా సాగిపోతున్న సమయంలో చిత్ర యూనిట్ కు మహేష్ ఫ్యాన్స్ నుండి భారీ షాక్ ఎదురైంది.

 Break For Mahesh Sarkaru Vaari Paata Shooting-TeluguStop.com

అభిమానులు కారణంగా సర్కారు షూట్ ను అర్ధాంతరంగా ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది.

Telugu Break For Mahesh Sarkaru Vaari Paata Shooting, Hyderabad, Keerthy Suresh, Mahesh Babu, Parasuram, Samuthirakani, Sarkaru Vaari Paata, Sarkaru Vaari Paata Shoot, Shooting Break-Movie

అభిమానులు కారణంగా షూటింగ్ వాయిదా ఎందుకు పడిందా అని ఆలోచిస్తున్నారా.అవును మహేష్ అభిమానుల కారణంగానే సర్కారు షూట్ ను నిలిపి వేశారు.ఫ్యాన్స్ ఉత్సాహం కారణంగా షూట్ వాయిదా వేయక తప్పలేదు.

 Break For Mahesh Sarkaru Vaari Paata Shooting-ఫ్యాన్స్ కారణంగా సర్కారు’ షూటింగ్ ఆపేసారు..ఎందుకంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పరశురామ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట షూటింగ్ ప్రెసెంట్ హైదరాబాద్ లో జరుగుతుంది.

ఇక్కడ మెట్రో స్టేషన్ లో కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.

ఉప్పల్ మెట్రో డిపోలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం మహేష్ అభిమానులకు తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు మెట్రో స్టేషన్ వద్దకు చేరుకున్నారు.దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవ్వడంతో షూట్ లో మహేష్ కూడా ఉన్నాడని తెలుసుకుని మరింత మంది తరలి వచ్చారు.

ఇక ఈ క్రౌడ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా షూటింగ్ ను మేకర్స్ నిలిపి వేశారు.

Telugu Break For Mahesh Sarkaru Vaari Paata Shooting, Hyderabad, Keerthy Suresh, Mahesh Babu, Parasuram, Samuthirakani, Sarkaru Vaari Paata, Sarkaru Vaari Paata Shoot, Shooting Break-Movie

ఉప్పల్ మెట్రో స్టేషన్ లో ఇప్పటికే మహేష్ కు విలన్ కు మధ్య సన్నివేశాలను తెరకెక్కించారు.ఇక ఇక్కడే మహేష్ కు సముద్రఖని మధ్య సన్నివేశాలు కూడా తీస్తుండగా మహేష్ అభిమానులు భారీగా రావడంతో అర్ధాంతరంగా నిలిపి వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందట.ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో మహేష్ కు జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది.

మైత్రి మూవీ మేకర్స్ 14 రీల్స్ ప్లస్ సంస్థ కలిసి ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా సంక్రాంతి 2022 లో విడుదల అవవబోతుంది.

#Samuthirakani #Break #Hyderabad #Keerthy Suresh #BreakMahesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు