ఆ దేశంలో భారత విమానాలకు బ్రేక్.. !

కరోనా వచ్చిన మొదట్లో ఈ వైరస్ ఇతరదేశాల్లో సృష్టిస్తున్న భీభత్సానికి మనదేశ వాసులందరు ఎంతో సానుభూతి తెలిపారు.ఆయ్యో పాపం చైనాలో, ఇటలీలో అయితే కరోనాతో మరణించిన శవాలు కుప్పలు కుప్పలుగా వేస్తున్నారట.

 Netherlands Banned Indian Flights, Covid Effect, Netherlands, Country, Suspends,-TeluguStop.com

దహన సంస్కారాలకు కూడా నోచుకోవడం లేదట.ఇంకా ఇంకా ఇలాంటి మాటలు ఎన్నో పలికాం.

కానీ ఇవేమాటలు ప్రస్తుత పరిస్దితుల్లో ప్రపంచ దేశాలు మన దేశాన్ని చూస్తూ అంటున్నాయి.

ఎందుకంటే ప్రస్తుతం మన దేశంలో రోగ నిరోధక శక్తి అనే మాట అటకెక్కగా, కరోనా బారిన పడుతున్న జనం ఎక్కువవుతున్నారు.

మరణాల సంఖ్య కూడా ఇదే స్దాయిలో కొనసాగుతుంది.అందు వల్ల ప్రస్తుత పరిస్దితుల్లో ప్రపంచ దేశాలు ఇండియా మీద ఆంక్షలు పెడుతున్నాయి.

ఈ క్రమంలో నెదర్లాండ్స్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి నెదర్లాండ్స్ వెళ్లే అన్ని ప్యాసింజర్ విమానాలపై నిషేదం విధించింది.

ఇక సోమవారం నుంచి మే1 వరకు ఈ నిషేదం అమలులో ఉంటుందని డచ్ ఏవియేషన్ మినిస్ట్రీ ఓ ప్రకటనలో తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube