బాత్‌రూమ్‌లో జారీపడి బ్రెజిల్ అధ్యక్షుడికి షార్ట్ టైమ్ మెమరీ లాస్

అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు చూస్తే దేశాన్ని పాలించే నియంతలైనా సామాన్యులేనని, వారు కూడా విధికి తలవంచాల్సిందేనని కాలం రుజువులు చూపిస్తూ ఉంటుంది.బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారోకు ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితిని చూస్తే అది నిజమేనని అనిపిస్తుంది.

 Brazil President Jair Bolsonaro Memory Fell In Bathroom-TeluguStop.com

అసలు మ్యాటర్‌లోకి వెళితే.64 ఏళ్ల బొల్సొనారో సోమవారం రాత్రి తన అధికారిక నివాసం అల్వొరాడా ప్యాలెస్‌లోని బాత్‌రూమ్‌లో జారిపడ్డారు.దీంతో ఆయన తలకు బలంగా దెబ్బ తగిలి తాత్కాలికంగా జ్ఞాపకశక్తిని కొల్పోయారు.ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఓ టీవీ ఛానెల్‌కు బొల్సొనారో ఇంటర్వ్యూ ఇచ్చారు.బాత్‌రూమ్‌లో పడిపోయిన వెంటనే తనకు ఏమీ గుర్తు లేదని.బహుశా ఆ సమయంలో జ్ఞాపకశక్తిని కోల్పోయానన్నారు.

ఆ తర్వాతి రోజు నుంచి నెమ్మదిగా పాత విషయాలు గుర్తుకు వచ్చినప్పటికీ.నిన్న ఏం చేశాననే విషయం తనకు గుర్తు లేదని, ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని తెలిపారు.

Telugu Braziljair, Jairbolsonaro, Telugu Nri Ups-

బాత్‌రూమ్‌లో కిందపడిన వెంటనే వ్యక్తిగత సిబ్బంది బొల్సోనారోను ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఆసుపత్రికి తరలించారు.సీటీ స్కాన్‌లో ఆయన తలకు ఎలాంటి గాయం కాలేదని వైద్యులు తెలిపడంతో డిశ్చార్జ్ చేశారు.కాగా ఈ ఏడాది జనవరిలో బొల్సొనారో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.గతేడాది ఎన్నికల ప్రచార సమయంలో బొల్సొనారోను గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచాడు.చికిత్సలో భాగంగా ఆయన ఇప్పటికే పలుమార్లు సర్జరీ సైతం చేయించుకున్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube