రూ.3.70 కోట్లు ఇస్తా విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకో.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన మోడల్?

సోషల్ మీడియాలో నిత్యం ఫాలో అయ్యే వారికి బ్రెజిల్ అందాల భామ క్రిస్ గలేరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తన అందం అభినయంతో నిత్యం సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఎంతోమంది కుర్రకారును ఆకట్టుకున్న ఈ హాట్ బ్యూటీ తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.

 Brazil Model Chris Galers Reaction To Arab Sheikh Offer,  Brazil Model, Arab Sha-TeluguStop.com

అయితే ఈమె చేసుకున్న వివాహమే ఈమెను స్టార్ సెలబ్రిటీగా నిలబెట్టిందని చెప్పవచ్చు.అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా.

సాధారణంగా వివాహమనేది ఒక అమ్మాయి అబ్బాయికి జరిగేది కానీ ఈ మోడల్ మాత్రం తనకు తానే ఎంతో ఖర్చు చేసి వివాహం చేసుకున్నారు.వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

ఇలా వివాహానికి ముందు ఈమె తీసుకున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.ఈ ఫోటోలను చూసి ఆమె అందానికి ముగ్ధుడైనటువంటి ఒక అరబ్ షేక్ ఈమెకు అద్భుతమైన ఆఫర్ కల్పించాడు.ఈమె తనని పెళ్లి చేసుకుంటే ఏకంగా రూ.3.70 కోట్లు ఇస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చారు.ఎలాగో తనకు తానే పెళ్లి చేసుకుంది కనుక విడాకులు కూడా తీసుకొని తనతో వచ్చేయమని చెప్పాడట.

ఇలా తనకు బంపర్ ఆఫర్ రావడంతో ఈ క్రమంలో మోడల్ స్పందిస్తూ ఆశ్చర్యకరమైన సమాధానాన్ని తెలియజేశారు.

Telugu Crorerupees, Arab Shaik, Arab Sheikh, Brazil, Brazilchris, Chris Galera,

నీ ఆఫర్ నాకు చాలా బాగా నచ్చింది.కానీ డబ్బుతో నా స్వేచ్ఛను కొనలేవు.డబ్బు కోసం నేను వివాహం చేసుకోనని అరబ్ షేక్ ఆఫర్ ను ఎంతో సున్నితంగా తిరస్కరించారు.

ప్రస్తుతం ఈ నటికి వచ్చిన ఆఫర్ గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.ఈ విషయం తెలిసిన నెటిజన్లు కొందరు అంత పెద్ద మొత్తంలో ఆఫర్ వదులుకోవడం ఏంటి తెలివితక్కువకాకపోతే అంటూ కామెంట్లు తనని తాను పెళ్లి చేసుకోవడం ఇదెక్కడి విడ్డూరం అంటూ చేయగా కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరు మాత్రం ఈమె డబ్బుకు ఆశపడకుండా అతని ఆఫర్ తిరస్కరించడంతో అందుకు ఈమె నిజాయితీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube