అక్కడ పోలీసులకి గేదెలను ఇస్తారంట.. ఎందుకో తెలుసా...?

మామూలుగా ఎక్కడైనా సరే పోలీస్ స్టేషన్లలో రవాణా సౌకర్యాల కోసం ద్విచక్ర వాహనాలను మరియు కార్లను పోలీసులు ఉపయోగిస్తుంటారు.కానీ ఆ దేశంలో మాత్రం పోలీసులు కార్లు, మోటార్ సైకిల్ తో పాటు గేదెలను కూడా పెట్రోలింగ్ చేసే సమయంలో ఉపయోగిస్తారు.

 Brazil Government Giving Buffalo To The Police For Patrolling In Amazon Forest,-TeluguStop.com

ఇప్పుడు అలాంటి దేశం గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

బ్రెజిల్.

ఈ దేశం పేరు వినగానే మొట్టమొదటిగా అందరికీ దట్టమైన అమెజాన్ అడవులు మరియు ఫుట్ బాల్ ఆట గుర్తొస్తుంది.అయితే ఈ దేశం యొక్క రాజధాని బ్రెజిలియ.

ఈ దేశంలో దాదాపుగా 20 కోట్ల మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు.అయితే ఈ దేశంలో విధులు నిర్వహించే పోలీసులకి ప్రభుత్వ అధికారులు కార్లు మరియు మోటార్ సైకిల్స్ తో పాటు గేదెలను కూడా ఇస్తారు.

ఎందుకంటే దట్టమైన అమెజాన్ అడవుల పరివాహక ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేసే సమయంలో పోలీసులు ఈ గేదెల పైన వెళతారు.దీనికితోడు అడవి ప్రాంతంలో కార్లను మరియు మోటార్ సైకిల్ ను ఉపయోగించడానికి వీలు కాక పోవడం, ఎప్పుడూ కూడా చిత్తడి నేలలు కలిగి ఉండడం వల్ల పెట్రోలింగ్ కి పోలీసులు గేదెలను ఉపయోగిస్తారు.

అలాగే పోలీసు ఉద్యోగంలో చేరేటప్పుడు తీసుకునే ట్రైనింగ్ లో ఈ గేదెలను ఎలా ఉపయోగించాలనే విషయంపై కూడా శిక్షణ తీసుకుంటారు.

Telugu Amazon Forest, Brazil, Brazilbuffalo, Buffalo-Latest News - Telugu

అలాగే బ్రెజిల్ దేశంలో లింగ మార్పిడి ని చట్టబద్ధం చేశారు.దీంతో ఈ దేశంలో లో 2015 జనాభా లెక్కల ప్రకారం దాదాపుగా 20 శాతం మంది నపుంసకులు ఉన్నట్లు సమాచారం.అంతేకాక ప్రపంచ దేశాల నుంచి బ్రెజిల్ దేశానికి చాలా మంది లింగ మార్పిడి నిమిత్తమై ప్రతి ఏటా వస్తుంటారు.

అయితే ఈ దేశంలో పేద గ్రామాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి.దాంతో యువత డబ్బు సంపాదించేందుకు డ్రగ్స్ సరఫరా చేయడం, ఆయుధాలను అక్రమంగా తరలించడం, అలాగే వ్యభిచారం వంటి వాటిపై ఎక్కువగా ఆధార పడ్డారు.

దీంతో ఇప్పటికీ బ్రెజిల్ దేశంలోని పలు గ్రామాల్లో కనీస వసతులకు నోచుకోక ప్రజలు గుడిసెల్లో నివాసముంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube