గౌతమీపుత్ర శాతకర్ణి మొదటి టికెట్ కి అంత రేటా     2017-01-11   21:00:30  IST  Raghu V

నందమూరి బాలకృష్ణ నూరవ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి కూకట్ పల్లి శ్రీ భ్రమరాంబ థియేటర్ లో ప్రీమియర్ షో ఉదయం 5 గం.లకు వేయనున్నారు. పండుగ వాతావరణంలో జరుగుతున్న ఈ ప్రీమియర్ షో కి బాలకృష్ణ హాజరుకానున్న సంగతి తెలిసిందే. బాలయ్య తన అభిమానులతో కలిసి సినిమా చూడడం తో అత్యంత ప్రాధ్యాన్యత సంతరించుకుంది ఈ ప్రీమియర్ షో.

ఈ షో కి మొదటి టికెట్ ను రూ.1,00,100 కి గోపిచంద్ యిన్నమూరి అనే అభిమాని దక్కించుకున్నారు. బాలయ్య ఆ అభిమానితో కలిసి సినిమా వీక్షించనున్నారు. ఎప్పుడు సేవ మార్గంలో ఉండే బాలయ్య బాట లోనే బెనిఫిట్ షో నిర్వాహకులు ఈ టికెట్ మొత్తాన్ని బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ ఆసుపత్రికి అందచేయనున్నారు. ప్రీమియర్ షో నిర్వాహకులైన మనబాలయ్య.కాం నవీన్ మోపర్తి మొదటి టికెట్ సొంతం చేసుకున్న అభిమానికి నారా రోహిత్ చేతుల మీదుగా టికెట్ ను అందచేశారు.

ప్రీమియర్ షో లు అంటే కాసేపు అభిమానం చూపి అరిచి గోల చేసే ఈ రోజుల్లో తమ అభిమాన కధానాయకుడి స్పూర్తితో ఇలా లక్షలాది రూపాయలు సమాజసేవకు ఉపయోగించడం విమర్శకుల ప్రసంసలు సైతం అందుకుంటున్నారు బాలయ్య అభిమానులు.