అమెరికాకు కొత్త టెన్షన్: తాగే నీళ్లలో సూక్ష్మజీవులు... అసలు విషయం ఏమిటంటే...?!

ప్రస్తుతం కరోనా వైరస్ తో ఇబ్బంది పడుతున్న అమెరికా తాజాగా మరో విషయం కొందరిని నిద్ర లేకుండా చేస్తోంది.అగ్రరాజ్యం లోని టెక్సాస్ రాష్ట్రంలో లైక్ జాన్సన్ ప్రాంతంలో నివసిస్తున్న జనాలు వారి ఇళ్లకు వచ్చే నీటిని చూసి భయపడుతున్నారు.

 Brain Eating Amoeba Nagleria Fowleri In Drinking Water, America, Brain Eating Ba-TeluguStop.com

దానికి కారణం లేకపోలేదు.వారికి వచ్చే టాప్ వాటర్ నీటిని తాగితే వారి మెదడు మాయమైపోతుందట.

ఎందుకో తెలుసా…? నేగ్లెరియా ఫోలరీ అనే సూక్ష్మజీవి కలవడం వల్ల పరిస్థితి ఏర్పడింది.అయితే ఈ నీరు తాగడం ద్వారా అందులో ఉన్న బ్యాక్టీరియా డైరెక్టుగా మెదడులోకి చేరుకొని అక్కడ మెదడును చిన్న చిన్నగా తినేస్తుందని వైద్య అధికారులు తెలుపుతున్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఓ కేసు ఫ్లోరిడా లో నమోదయినట్లు తెలుస్తోంది.

ఈ సంఘటనతో అమెరికా ప్రభుత్వం ఆ నీటిని శరీరం లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆ ప్రాంత ప్రజలకు సూచించారు.

తాజాగా జరిగిన పరిశోధనలలో లేక జాన్సన్ ప్రాంతంలో ఉన్న నీటిలో బాక్టీరియా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.దింతో వెంటనే అధికారులు ఆ నీటిని అసలు వాడొద్దని అధికారులు తెలియజేశారు.

దీంతో వారు ఇప్పుడు మంచినీళ్ళు తాగడానికి కూడా లేకుండా పోయిన పరిస్థితి ఏర్పడింది.ప్రస్తుతం ఆ ప్రాంతంలో చాలా మంది అమీబా లాంటి నేగ్లెరియా ఫోలరీ వల్ల ఇబ్బంది పడుతున్నారు.

నిజానికి ఆ ప్రాంతంలో 27 వేల మంది దాకా నివసిస్తున్నారు


ఇకపోతే నిజానికి ఈ బ్యాక్టీరియా ఇప్పుడు వచ్చింది కాదు.చాలా సంవత్సరాల క్రితమే ఇది బయటికి వచ్చిన… కాకపోతే ప్రస్తుతం పరిస్థితి తీవ్రంగా తయారైందని ఎవరైనా ఆ ప్రాంతంలోని నీటిని తాగినప్పుడు నీళ్లలో ఉన్న బ్యాక్టీరియా డైరెక్టుగా ముక్కుద్వారా లోపలికి వెళితే అది నేరుగా మెదడులోకి ప్రవేశిస్తుందని వైద్య అధికారులు తెలుపుతున్నారు.

దీంతో ప్రస్తుతం అక్కడి స్థానికులు ఆ నీటిని ముట్టుకోవడానికి పూర్తిగా భయపడుతున్నారు.కేవలం టాయిలెట్ ఫ్లష్ చేయడానికి మాత్రమే వాటిని ఉపయోగిస్తున్నారు.

టెక్సాస్ రాష్ట్రంలోని మొత్తం ఎనిమిది ప్రాంతాలకు ఈ హైఅలర్ట్ జారీ చేశారు.అయితే చివరికి మిగతా ప్రాంతాల్లో ఆ అలెర్ట్ ను వాపస్ తీసుకున్న అధికారులు లేక్ జాన్సన్ ప్రాంతంలో మాత్రమే అమలులో ఉంచారు.

ప్రస్తుతం బయటి నీరు తాగాలంటే హడలిపోతున్నారు అక్కడి ప్రజలు.కేవలం మినరల్ వాటర్ బాటిల్ ని మాత్రమే వారు ఉపయోగిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube