మహేష్ ఫ్యాన్స్ కి చిరాకు తెప్పించే వార్త

బ్రహ్మోత్సవం సినిమా మొదలైనప్పుడు సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామన్నారు.అంత స్పీడులో షూటింగ్ జరగకపోవడంతో ఏప్రిల్ కి షిఫ్ట్ చేసారు.

 Brahmotsavam New Release Date Is May 20th-TeluguStop.com

పోకిరి ఏప్రిల్ 28కి వచ్చి సంచలనాలు సృష్టించింది .అదే సెంటిమెంటు ప్రకారం ఏప్రిల్ 29న విడుదల చేస్తామన్నారు.ఇక ఆ సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్లేమో సినిమా మే కి వాయిదా పడుతుంది అని ప్రకటించడంతో మహేష్ అభిమానుల్లో కలవరం మొదలైంది

అయినా ఎక్కడో ఆశ .చెప్పిన సమయానికి .ఏప్రిల్ 29కే వస్తుందేమో అని.ఏప్రిల్ 29 మిస్ అయితే మే 6న సినిమా రావడం తథ్యమని యూనిట్ వర్గాలు వెళ్ళడించాయి.ఇప్పడు ఆ తేది కూడా కష్టమే అనిపిస్తోంది.బ్రహ్మోత్సవం కొత్త విడుదల తేది మే 20.పంపిణిదారులకు ఈరోజే ఈ సమాచారం వెళ్ళింది

మరి ఈ తేది మీదైనా నిలబడతారో లేక మళ్ళీ వాయిదా వేసి మహేష్ అభిమానులకి మరింత చిరాకు తెప్పిస్తారో! ఏప్రిల్ మిస్ అయ్యి, మే కూడా మిస్ అయితే .జూన్ కి బదులు జులైలోనే సినిమా విడుదల ఉండచ్చని వార్తలు వస్తున్నాయి.అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఒకే .లేదంటే సూపర్ స్టార్ ఫ్యాన్స్ మరో రెండు మూడు నెలలపాటు నిద్రలేని రాత్రులు గడపాల్సిందే!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube