బాలుడి తల నరికేసిన ఆటోడ్రైవర్..!

దేశంలో కరోనా విజృభిస్తున్న క్రైమ్ రేట్ ఏ మాత్రం తగ్గడం లేదు.చిన్న గొడవ ఓ బాలుడిని ప్రాణం బలి తీసుకుంది.

 Brahmaputra River In Assam Is Mahogany-TeluguStop.com

తనతో బాలుడు, అతని తల్లి గొడవ పడ్డారు.దింతో కోపంతో రగిలిపోయిన అతను బాలుడిని నమ్మించి బయటికి తీసుకెళ్లి అతి కిరాతంగా హత్య చేశాడు.

మృతదేహాన్ని అడవిలో పడేసి వచ్చాడు.మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

 Brahmaputra River In Assam Is Mahogany-బాలుడి తల నరికేసిన ఆటోడ్రైవర్..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ అమానుష ఘటన ముంబైలో చోటుచేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

ముంబైకి చెందిన ఆటో డ్రైవర్ కరణ్ బహదూర్ నగరంలోని ఆరే పోలీస్ స్టేషన్ పరిధిలో జీవనం సాగిస్తున్నాడు.లోతట్టు ప్రాంతం కావడంతో ఇంటి ముందు పడిన వర్షపు నీరు లోపలికి రాకుండా సిమెంట్‌తో చిన్న నిర్మాణం చేశాడు.

ఎదురింట్లో ఉంటున్న బాలుడు విదానంద్ యాదవ్(13) ఆ సిమెంట్ నిర్మాణాన్ని ధ్వంసం చేశాడు.దీంతో కరణ్‌కి కోపమొచ్చి చెడామడా తిట్టేశాడు.దీంతో బాలుడితో సహా అతని తల్లి కరణ్‌తో గొడవపడ్డారు.

అది మనసులో పెట్టుకున్న కరణ్ కక్ష పెంచుకున్నాడు.

కొద్దిరోజుల తర్వాత బాలుడిని జాలీరైడ్ పేరుతో ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లాడు.నగర శివారులోని మల్వాని ప్రాంతంలో దారుణంగా హత్య చేశాడు.

సంఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని పరిశీలించారు.పోలీసులు హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా మిస్సింగ్ కంప్లైంట్‌లపై ఆరా తీయడంతో ఆరే పోలీస్ స్టేషన్‌లో బాలుడి అదృశ్యమైనట్లు తెలిసి అతని తల్లిదండ్రులను ఆరా తీశారు.మత్యకు గురైంది విదానంద్ యాదవ్‌గా తల్లిదండ్రులు గుర్తించారు.

వారు ఇచ్చిన సమాచారం మేరకు విచారణ జరిపి నిందితుడు కరణ్‌ని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.

#Mumbai #Auto Driver #Murder #Police

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు