Brahmani lokesh : బైక్ రైడర్ గా యాత్ర చేపట్టిన బ్రాహ్మణి... వీడియో వైరల్!

బాలకృష్ణ కుమార్తెగా నారా బ్రాహ్మణి అందరికీ సుపరిచితమే అయితే ఈమె తన సొంత టాలెంట్ తో మహిళ వ్యాపారవేత్తగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.బాలకృష్ణ కుమార్తెగా మాత్రమే కాకుండా నారా లోకేష్ సతీమణిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బ్రాహ్మిని హెరిటేజ్ ఫుడ్ సంస్థను ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తూ మహిళ వ్యాపారవేత్తగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.

 Brahmani Undertook The Trip As A Bike Rider The Video Has Gone Viral Brahmani Bi-TeluguStop.com

అయితే బ్రాహ్మణి గురించి ఈ విషయాలు వరకే మనకు తెలుసు అయితే ఈమెలో మనకు తెలియని మరొక టాలెంట్ కూడా దాగి ఉందని తాజాగా అందరికీ తెలుస్తోంది.

బ్రాహ్మణి కేవలం వ్యాపారాలు చూసుకోవడమే కాకుండా ఒక మంచి బైక్ రైడర్ అనే విషయం ఎవరికీ తెలియదు.

ఈమెకు బైక్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టమని అందుకే తాను ప్రొఫెషనల్ బైక్ రైడింగ్ గ్రూపులో మెంబర్ గా కూడా కొనసాగుతున్నారు.తాజాగా ఈమెలేహ్ ప్రాంతానికి బైక్ రైడింగ్ వెళ్ళినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోని ఈ రైడింగ్ విశేషాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఒక వీడియోని షేర్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇలా ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది అభిమానులు బ్రాహ్మణిలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.మరి కొంతమంది అభిమానులు బాలయ్య కూతురా మజాకా అంటూ ఈ వీడియో పై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇకపోతే నారా బ్రాహ్మణి గురించి లోకేష్ గురించి సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ వచ్చినప్పటికీ ఈమె వాటి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube