మీమర్ లపై బ్రహ్మానందం వైరల్ కామెంట్స్...ఏమన్నారంటే?

Brahmanandam Viral Comments On Mimers What Do You Mean

బ్రహ్మానందం అంటే తెలియని తెలుగు వెండితెర ప్రేక్షకుడు ఉండరంటే అతిశయోక్తి కాదు.జంధ్యాల తరువాత ఆ స్థానాన్ని భర్తీ చేయడం అంత ఆశామాషీ విషయం కాదు.

 Brahmanandam Viral Comments On Mimers What Do You Mean-TeluguStop.com

అయితే తెలుగు వెండితెర ప్రేక్షకులకు జంధ్యాల లేని లోటు తీర్చింది బ్రహ్మానందం అని వందకు వంద శాతం ప్రతి ఒక్క తెలుగు వెండి తెర ప్రేక్షకులు చెప్తారు.ఇప్పటికే వెయ్యికి పైగా చిత్రాలలో నటించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసుకొని కామెడీ కింగ్ గా తనకంటూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక పేజీని క్రియేట్ చేసుకున్నాడు.

కొన్ని సినిమాలు హీరో, హీరోయిన్ , పాటలతో కాకుండా బ్రహ్మానందం కామెడీతోనే సూపర్ హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి.అంతలా ప్రేక్షకులతో కలసి ఒక తెలియని బంధం ఏర్పరుచుకున్నారు కామెడీ లెజెండ్.

 Brahmanandam Viral Comments On Mimers What Do You Mean-మీమర్ లపై బ్రహ్మానందం వైరల్ కామెంట్స్…ఏమన్నారంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Brahmanandam, Brahmanandam-Latest News - Telugu

అయితే ఈ మధ్య చాలా సినిమాల్లో బ్రహ్మానందం నటించలేదు.అయితే కొద్దిగా ప్రేక్షకుల్లో మరల బ్రహ్మీ సినిమాలో మెరవాలని వేలాది మంది ప్రేక్షకులు కోరుకుంటున్న పరిస్థితి ఉంది.అయితే ప్రస్తుతం బ్రహ్మానందం సినిమాల్లో కన్నా మీమ్స్ లో ఎక్కువగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే.అయితే సెలెబ్రెటీలు మీమ్ లపై పెద్దగా స్పందించరు.అయితే బ్రహ్మానందం తనపై వస్తున్న మీమ్స్ పై స్పందిస్తూ మీమర్ లపై బ్రహ్మానందం చేసిన కామెంట్స్ నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.సినిమాల్లో కనిపించకున్నా మీమ్స్ తో ప్రేక్షకులను తన వల్ల ఎంటర్ టైం చేస్తున్నారని మీమ్స్ చేసే ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ తన సంతోషాన్ని అలీతో సరదాగా షోలో అతిథిగా వచ్చిన సందర్భంలో ఈ కామెంట్స్ చేశారు.

దీంతో బ్రహ్మానందం స్పోర్టివ్ నెస్ కి నెటిజన్లు ఫిదా అయ్యారని చెప్పవచ్చు.

#Brahmanandam #Brahmanandam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube