సన్నీ లియోన్ తో బాలీవుడ్ లో సందడి చేస్తున్న సునీల్, బ్రహ్మానందం  

సన్నీ లియోన్ తో బాలీవుడ్ సినిమాలో సందడి చేయనున్న సునీల్, బ్రహ్మానందం..

Brahmanandam, Sunil Acting With Sunny Leone-

పోర్న్ స్టార్ గా కెరియర్ ప్రారంభించి తరువాత యూ టర్న్ తీసుకొని బాలీవుడ్ లో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి సన్నీ లియోన్.ఒకప్పుడు పోర్న్ స్టార్ గా ఎంతో మంది యూత్ కి ఎంటర్టైన్ చేసిన సన్నీ వరుస అవకాశాలు అందుకొని బాలీవుడ్ లో పాగా వేసింది.

Brahmanandam, Sunil Acting With Sunny Leone--Brahmanandam Sunil Acting With Sunny Leone-

స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు రాకపోయిన బీటౌన్ లో బోల్డ్ కంటెంట్ సినిమాలు అంటే సన్నీ గుర్తుకోచ్చేలా చేసింది.ఇక సౌత్ లో కూడా ఐటమ్ సాంగ్స్ తో ఈ పంజాబీ భామ సందడి చేసింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు బాలీవుడ్ లో సన్నీ ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తుంది.సౌత్ ఇండియా దర్శకుడు అయిన తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులతో కూడా టాలీవుడ్ కి చెందిన స్టార్ కమెడియన్స్ బ్రహ్మానందం, సునీల్ కీలక పాత్రలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

కోకోకోలా టైటిల్ తో తెరకేక్కుతున్న ఈ సినిమా యూపీలో హవేలీ ప్రాంతంలో ఓ పురాతన బంగ్లాలో షూటింగ్ కి రెడీ అయ్యింది.ఇక ఈ షూటింగ్ లో సన్నీతో పాటు బ్రహ్మానందం, సునీల్ కూడా సందడి చేయబోతున్నారు అని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో వీళ్ళతో పాటు కొంత మంది సౌత్ నటులు కూడా ఉండటంతో తెలుగులో కూడా డబ్బింగ్ చేయడానికి దర్శకుడు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.మరి సన్నీతో బ్రాహ్మి, సునీల్ కాంబినేషన్ ని తెరపై ప్రేక్షకులు ఎంత వరకు ఎంజాయ్ చేస్తారు అనేది చూడాలి.