బ్రహ్మి ఏడిపించేశాడు..!

నవ్వుల రారాజు.హాస్య బ్రహ్మ బ్రహ్మానందం పుట్టినరోజు నేడు.

 Brahmanandam Special Rangamarthanda Scene Released, Brahmanandam, Rangamarthanda-TeluguStop.com

తెలుగు సినిమా చరిత్రలో బ్రహ్మానందం కు ప్రత్యేకమైన పేజీలు ఉంటాయని చెప్పొచ్చు.ఆయన కామెడీతో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వారు.

అయితే అప్పుడెప్పుడో బాబాయ్ హోటల్ సినిమాలో సీరియస్ రోల్ చేసిన బ్రహ్మానందం ఆ తర్వాత ఇన్నాళ్లకు రంగమార్తాండ సినిమాలో సీరియస్ రోల్ చేశారు.ఈ సినిమాలో బ్రహ్మి పాత్ర చాలా సీరియస్ గా ఉంటుందని తెలుస్తుంది.

ఇక దానికి శాంపిల్ గా సినిమా నుంచి బ్రహ్మానంద డైలాగ్ ఒకటి రిలీజ్ చేశారు.

Telugu Brahmanandam, Brahmi, Krishna Vamsy, Prakash Raj, Rangamarthanda, Tollywo

హాస్పిటల్ బెడ్ మీద ఒక పెద్ద డైలాగ్ ఏడుస్తూ బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ ఆడియన్స్ ని కూడా ఏడిపించేసిందని చెప్పొచ్చు.సినిమాలో బ్రహ్మి సీరియస్ రోల్ సినిమాకే హైలెట్ అనిపించేలా ఉంటుందని టాక్.కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రంగమార్తాండ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

మరాఠి సినిమా నట సామ్రాట్ కి రీమేక్ గా వస్తున్న రంగమార్తాండ సినిమాలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, శివాత్మిక, అనసూయ, అలి రెజా, రాహుల్ సిప్లిగంజ్ ఇలా చాలామంది నటీనటులు ఉన్నారు.సినిమా షూటింగ్ పూర్తై నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube