సిల్వర్ స్క్రీన్ పై బిల్డప్ బాబాయ్ పాత్రలో బ్రహ్మానందం

వెండితెరపై దర్శకులు సృష్టించిన పత్రాలు కొన్ని అద్బుతంగా పేలుతాయి.కామెడీ పరంగా పుట్టిన కామిక్ పత్రాలకి సీక్వెల్స్ కూడా తరువాత కొనసాగాయి.

 Brahmanandam Ready To Play Buildup Babai Role In Movie, Tollywood, Pellisandadi-TeluguStop.com

అలాగే ఆ కామిట్ పాత్రలని బుల్లితెరపై సీరియల్స్, కామెడీ షోల కోసం ఉపయోగించుకున్న సందర్భాలు ఉన్నాయి.చాలా మంది మిమిక్రీ కళాకారులు వెండితెరపై దర్శకులు క్రియేట్ చేసిన కామిట్ పాత్రలని స్టేజ్ పై వేసి అందరికి వినోదాన్ని పంచుతూ ఉంటారు.

అలా కొన్ని పాత్రలు చిరస్థాయిగా నిలిచిపోతాయి.జంధ్యాల సృష్టించి ఎన్నో కామిక్ కామెడీ పాత్రలని బుల్లితెరపై, స్టేజ్ షోలపై చాలా సందర్భాలలో మళ్ళీ మళ్ళీ ప్రదర్శించారు.

ఈ జెనరేషన్ లో అలాంటి పత్రాలని సిల్వర్ స్క్రీన్ పై సృష్టించే దర్శకులు చాలా తక్కువగా ఉన్నారు.అయితే జబర్దస్త్ షో పుణ్యమా అని చాలా కామిక్ పాత్రలు కొత్తకొత్తగా పుట్టుకొస్తూ అందరికి వినోదాన్ని అందిస్తున్నాయి.

ముఖ్యంగా సుడిగాలి సుదీర్ టీమ్ లో గెటప్ శ్రీను చేసిన బిల్డప్ బాబాయ్ పాత్ర ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే.

ఈ బిల్డప్ బాబాయ్ పాత్రకి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

వందల సంఖ్యలో మీమ్స్ కూడా బిల్డప్ బాబాయ్ పేరుతో క్రియేట్ అయ్యాయి.కొన్ని పొలిటికల్ పంచ్ ల కోసం బిల్డప్ బాబాయ్ క్యారెక్టర్ ని ఉపయోగించుకుంటారు.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ పాత్రని సిల్వర్ స్క్రీన్ పై ప్రెజెంట్ చేయడానికి రెడీ అవుతున్నారు.దర్శక ధీరుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కుతున్న పెళ్లిసందడి సినిమాలో బిల్డప్ బాబాయ్ పాత్రని ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తుంది.

ఈ పాత్ర కోసం స్టార్ కమెడియన్ బ్రహ్మానందంని రంగంలోకి దించుతున్నట్లు బోగట్టా.ఈ పాత్ర పెళ్లి సందడి సినిమాలో కొద్ది సేపే ఉన్న కావాల్సినంత వినోదం పంచుతుందని తెలుస్తుంది.

రీసెంట్ గా జాతిరత్నాలు సినిమాలో జడ్జ్ పాత్రలో బ్రాహ్మీ చాలా గ్యాప్ తర్వాత హ్యూమర్ పంచారు.ఇప్పుడు ఈ బిల్డప్ బాబాయ్ పాత్రలో వినోదం పంచనున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube