బ్రహ్మానందంను ఇలా చూపించడానికి బుద్ది లేదా?

సుడిగాలి సుధీర్‌ మరియు దీపిక పిల్లి జంటగా తెరకెక్కిన వాంటెడ్‌ పండుగాడ్‌ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది.ఇప్పటికే ఈ సినిమా ను జనాల్లో భారీ ఎత్తున తీసుకు వెళ్లే ప్రయత్నం చేశారు.

 Brahmanandam In Wanted Pandugod Movie , Brahmi, Deepika Pilli, Film News, News In Telugu, Sudigali Sudheer, Wanted Pandugod-TeluguStop.com

శ్రీధర్ శ్రీపాన దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమాను రాఘవేంద్ర రావు కుటుంబంకు చెందిన వారు నిర్మించడం వల్ల రాఘవేంద్ర రావు స్వయంగా ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్నాడు.ఈ సినిమా లో భారీ స్టార్‌ కాస్టింగ్ ఉంది.

జబర్దస్త్‌ కమెడియన్స్ తో పాటు చాలా మంది ఇండస్ట్రీ కమెడియన్స్ ను ఈ సినిమా లో చూపించేందుకు యూనిట్‌ సభ్యులు సిద్ధం అయ్యారు.ఈ సినిమా లో ది లెజెండ్‌ బ్రహ్మానందం కూడా కనిపించబోతున్నాడు.

 Brahmanandam In Wanted Pandugod Movie , Brahmi, Deepika Pilli, Film News, News In Telugu, Sudigali Sudheer, Wanted Pandugod-బ్రహ్మానందంను ఇలా చూపించడానికి బుద్ది లేదా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బ్రహ్మానందం ను జనాలు ఒక గొప్ప కమెడియన్‌ గా చూస్తూ ఉంటారు.ఇప్పటి ప్రేక్షకులకు ఆయన గొప్పతనం తెలియక పోవచ్చు.

కాని ఆయన ఏ స్థాయి కమెడియన్‌ అనే విషయం కాస్త ఏజ్‌ ఎక్కువ ఉన్న ప్రేక్షకులకు తెలుసు.

అలాంటి గొప్ప కమెడియన్‌ ను.సినిమా దేవుడిని ఇలా అమ్మాయి తొడల మధ్య చూపించడం.అలాగే కాస్త ఎబెట్టు పాత్రలో చూపించే ప్రయత్నం చేయడం ఏమాత్రం సరి కాదు అంటూ విమర్శలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియా లో వైరల్‌ అవుతుండగా.ఇదే సమయంలో ఆయన అభిమానుల మనో భావాలను దెబ్బ తీస్తున్నాయి.బ్రహ్మానందంను ఇలా చూపించేందుకు మీకు ఏమైనా బుద్ది ఉందా అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.సినిమా లో ఈ స్టిల్‌ లేదా సన్నివేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా సినిమా బ్యాన్‌ చేయాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తాం అంటూ బ్రహ్మానందం అభిమానులు హెచ్చరిస్తున్నారు.

ఈ పోస్టర్ లను వెన్నక్కి తీసుకోవాలంటూ బ్రహ్మీ అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు.బ్రహ్మానందంకు ఉన్న క్రేజ్ ను ఇలా వాడుకోవాలని మేకర్స్ ఇలాంటి పోస్టర్స్ ను విడుదల చేయడం జరిగింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube