అమీర్ ఖాన్ లా మారిన బ్రహ్మానందం

ఆమీర్ ఖాన్ పీకే అందరు చూసారు కదా .వింత వింత వేషధారణలతో మనల్ని కడుపుబ్బా నవ్వించాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.

 Brahmanandam Imitates Aamir Khan-TeluguStop.com

పీకే భూమి మీదకి వచ్చి పడే పాట్లు, చేసే అల్లర్లు చూసి నవ్వుకొని వారు లేరు.ఆ వింత బట్టలు ఆమిర్ ఖాన్ వేస్తేనే అంతలా నవ్వుకుంటే … చిన్న చూపుతోనే నవ్వించే బ్రహ్మానందం పీకే వేషధారణలో కనిపిస్తే .నవ్వి నవ్వి కడుపులో నొప్పి పుడుతుందేమో.

ఇంతకీ మన బ్రాహ్మి పీకేలా ఎందుకు మారాడో తెలుసా .కొత్త చిత్రం గరం కోసం.ఆది, అదా శర్మ జంటగా నటిస్తున్న గరంలో బ్రహ్మానందం మనల్ని పీకే అవతారంలో నవ్వించనున్నారు.

బ్రహ్మానందం కుడా ఏదైనా వేరే గ్రహం లోంచి భూమి మీదకి వచ్చారా అంటే … సినిమా విడుదల అయ్యాకే తెలుసుకోవాలి.

మదన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

గత ఏడాదే షూటింగ్ మొదలుపెట్టినప్పటికీ ఆది పెళ్లి పనుల్లో బిజీ అయిపోవడం, తర్వాత ఆది తాతయ్య చనిపోవడంతో చిత్రం వాయిదా పడుతూ వచ్చింది.త్వరత్వరగా షూటింగ్ మొత్తం అయిపోయి మన బ్రహ్మానందాన్ని పీకే అవతారం లో చూసుకునే భాగ్యం త్వరగా కలిగితే బాగుండు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube