బ్రహ్మానందం హోస్ట్ చేసిన షో ఏదో తెలుసా?

హాస్యనటుడు బ్రహ్మనందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగు సాహిత్యంలో ఏం.

 Comedian Brahmanandam Hosted Brahmi 10 Lakshalu Show In 2009 Comedian Bramhanand-TeluguStop.com

ఏ చదివి అత్తిలిలో 9 సంవత్సరాలు లెక్చరర్ గా పనిచేసిన బ్రహ్మానందం ఆ తరువాత సినీరంగం వైపు అడుగులేశారు.విద్యార్ధి దశలో ఉండగా తన చుట్టుపక్కల జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ ను ఆధారంగా చేసుకొని మిమిక్రీలు చేయడం, కల్చరల్ పోగ్రామ్ లలో పాల్గొనేవాడు.

ఆ తరువాత అత్తిలిలో తెలుగు లెక్చరర్ గా పని చేస్తూ నిజ జీవితంలోని కొంతమందిని ఇమిటేట్ చేస్తూ 1985లో దూరదర్శన్ లో పకపకలు అనే పోగ్రామ్ చేశారు.టీవీలు లేని ఆరోజుల్లోనే బ్రహ్మానందం పకపకలు పోగ్రామ్ తో మంచి పేరు సంపాదించుకున్నారు.

ఎక్కడికి వెళ్లినా బ్రహ్మానందాన్ని గుర్తుపట్టడంతో సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు.

ఆ తరువాత అదే ఏడాది బ్రహ్మానందం పుట్టిన రోజైన ఫిబ్రవరి 1న డైరక్టర్ వేజెళ్ల సత్యనారాయణ దర్శకత్వంలో నరేష్ హీరోగా శ్రీతాతావతారం అనే సినిమాలో నరేష్ కు ఉన్న నలుగురు స్నేహితుల్లో బ్రహ్మానందం ఒక స్నేహితుడి పాత్రపోషించారు.

తొలి చిత్రం శ్రీతాతావతారమే అయినా 1987లో జంద్యాల డైరక్షన్ లో ఆహ నా పెళ్లంట చిత్రం తెరకెక్కింది.ఆ చిత్రంలో బ్రహ్మానందం అరగుండు గెటప్ లో పోతావ్ రా రేయ్.

నాశనమై పోతావ్ అంటూ కోటా శ్రీనివాసరావును తిట్టే సన్నివేశాలతో బ్రహ్మానందం కాస్త హాస్య బ్రహ్మగా మారారు.

అక్కడి నుంచి మొదలైన బ్రహ్మీ నట ప్రస్థానం ఇప్పటికి ఖండాంతరాలు దాటి నేటికి నిర్విరామంగా కొనసాగుతుంది.కేవలం 20సంవత్సరాల్లో 745 చిత్రాల్లో యాక్ట్ చేసి రికార్డ్ సృష్టించారు.2010లో 1000 సినిమాల్లో నటించినందుకుగాను బ్రహ్మీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కెక్కాడు.దీంతో పాటు పద్మశ్రీ, ఐదు నందీ అవార్డ్ లు , ఒక ఫిల్మ్ ఫేర్ , ఆరు సినిమా అవార్డ్ లు, మూడు సైమా అవార్డ్ లు సొంతం చేసుకోవడం టాలీవుడ్ చరిత్రలో ఆయనకే దక్కింది.వయస్సు మీదపడుతున్నా ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు.

రీసెంట్ గా విడుదలైన అలవైకుంఠపురంలో బ్రహ్మానందం తన కామెడీ టైమింగ్ కడుపుబ్బా నవ్వించారు.ఇంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ హాస్య బ్రహ్మీ అభిమానులను అలరించేందుకు హోస్ట్ గా వ్యవహరించారు.2009లో కౌన్ బనేగా కరోడ్ పతి స్టైల్లో బ్రహ్మీ 10లక్షల షోకి హోస్ట్ గా చేశారు.రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలతో తన కామెడీతో అభిమానుల్ని అలరించాలని కోరుకుందాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube