బ్రహ్మనందంకు భలే పెరిగిన క్రేజ్

ఒకానొక సమయంలో సినిమా హిట్ అయిందంటే ఆ సినిమాలో బ్రహ్మానందం ఉండేవాడు.ఆ సినిమా పెద్ద సినిమా లేదా చిన్న సినిమా అనే తేడా లేకుండా తన హవాని నడిపాడు.

 Brahmanandam Craze Increases-TeluguStop.com

అయితే ఈ మధ్య కాలంలో బ్రహ్మానందం లేకపోయినా సినిమాలు హిట్ అవుతున్నాయి.ఒకప్పుడు హిట్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉండేవాడు.

ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటె… పొరుగు రాష్ట్రాల్లో క్రేజ్ పెరిగింది.

కమల్ హాసన్ ‘శభాష్ నాయుడు’ సినిమాలో బ్రహ్మి ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు.అంతేకాక కన్నడలో తెరకెక్కుతున్న ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో కూడా బ్రహ్మికి ఒక కీలకమైన పాత్ర దక్కింది.

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు.మాజీ సీఎం కుమారస్వామి తనయుడు అయిన నిఖిల్ గౌడ హీరోగా 50 కోట్ల భారీ బడ్జెట్ తో ‘జాగ్వార్’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఆ సినిమాలో బ్రహ్మి అవకాశాన్ని దక్కించుకున్నాడు.

ఇప్పటివరకు తెలుగులో తన హవాను చాటిన బ్రహ్మానందం ఇక పొరుగు రాష్ట్రాల్లో తన సత్తా ఏమిటో చెప్పటానికి రెడీ అవుతున్నాడు.

టాలెంట్ ఉంటే బాష సమస్య కాదని ఎక్కడైనా రాణించవచ్చని బ్రహ్మి కెరీర్ ఉదాహరణ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube