బుల్లితెరపై ద్రుష్టి పెట్టిన బ్రహ్మానందం  

brahmanandam concentrate on television, Tollywood, Telugu Cinema, South cinema, Telugu Television, Serials - Telugu Brahmanandam Concentrate On Television, Serials, South Cinema, Telugu Cinema, Telugu Television, Tollywood

టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు బ్రహ్మానందం.బ్రహ్మానందం సినిమాలో ఉన్నాడంటే కచ్చితంగా నవ్వులు పూయిస్తాడు అనే బ్రాండ్ మొన్నటి వరకు ఉండేది.

 Brahmanandam Concentrate On Television

దీంతో ప్రతి దర్శకుడు తమ సినిమాలో కచ్చితంగా బ్రహ్మానందం పాత్ర ఉండే విధంగా చూసుకునేవారు.అయితే దర్శకుల ఆలోచన మారడం, సినిమాలలో కామెడీ కంటెంట్ తగ్గడంతో బ్రహ్మానందం పాత్ర ఉన్న పూర్తిస్థాయిలో కామెడీ వర్క్ అవుట్ అవ్వలేదు.

దీంతో అతనికి సినిమా అవకాశాలు తగ్గాయనే చెప్పాలి.అలాగే ప్రస్తుతం కామెడీ పండించే కొత్తతరం నటులు వస్తూ ఉండటంతో బ్రహ్మానందం వయస్సుకి తగ్గ పాత్రలని దర్శకులు కూడా తీర్చిదిద్ధలేకపోతున్నారు.

బుల్లితెరపై ద్రుష్టి పెట్టిన బ్రహ్మానందం-Movie-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే ఈ మధ్య హార్ట్ ఆపరేషన్ చేసుకున్న బ్రహ్మానందం మునుపటి వేగంతో సినిమాలు చేయడం లేదు.ఆయన కూడా ఖాళీ సమయాన్ని తన చిత్రలేఖన సామర్ధ్యానికి పదును పెట్టేందుకు ఉపయోగించుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు బ్రాహ్మీ ఆలోచన బుల్లితెర మీద పడినట్లు తెలుస్తుంది.ఫుల్ లెంత్ కామెడీతో ఉండే ఒక సీరియల్ చేసేందుకు ప్రముఖ చానల్ తో బ్రాహ్మీ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది.

ఇప్పటికే అలాంటి సీరియల్ కూడా సదరు చానల్ సిద్ధం చేసిందని టాక్ వినిపిస్తుంది.త్వరలో దీనికి సంబందించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.

సినిమాల కంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత చేరువగా ఉండే సీరియల్స్ చేస్తే బెటర్ అనే ఆలోచనతో బ్రహ్మానందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

#Serials

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Brahmanandam Concentrate On Television Related Telugu News,Photos/Pics,Images..