టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంతోమంది కొత్త కమెడియన్లు( Comedians ) ఎంట్రీ ఇచ్చినా బ్రహ్మానందం కామెడీ టైమింగ్ వేరే లెవెల్ అనే సంగతి తెలిసిందే.బ్రహ్మానందం ఎన్నో సినిమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషించారు.
ఆయన కామెడీ టైమింగ్ వల్లే సక్సెస్ సాధించిన సినిమాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి.బ్రహ్మానందం కామెడీ వల్ల కొన్ని సినిమాల రేంజ్ పెరిగింది.
కొన్ని సినిమాలకు బ్రహ్మానందం( Comedian Brahmanandam ) సెకండ్ హీరో అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.శీనువైట్ల డైరెక్షన్ లోని సినిమాలు ప్రధానంగా బ్రహ్మానందంకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
ఢీ, రెడీ సినిమాలలోబ్రహ్మానందం నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
వెంకీ సినిమా( Venky )లో బ్రహ్మానందం నటన ఆ సినిమాకు హైలెట్ గా నిలిచింది.దూకుడు, బాద్ షా సినిమాలలో బ్రహ్మానందం పాత్రలు వేరే లెవెల్ లో ఉన్నాయి.ఈ రెండు సినిమాలకు బ్రహ్మానందం సెకండ్ హీరో చెప్పడంలో సందేహం అవసరం లేదు.
దూకుడు సినిమా( Dookudu )లో పద్మశ్రీ పాత్రలో, బాద్ షా సినిమాల్లో పద్మనాభసింహ పాత్రలో బ్రహ్మానందం అదుర్స్ అనిపించారు.ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించడం గమనార్హం.
శ్రీనువైట్లకు ఈ సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టగా బాద్ షా తర్వాత శ్రీనువైట్ల( Director Srinu Vaitla ) సినిమాలేవీ సక్సెస్ సాధించలేదు.అత్తారింటికి దారేది సినిమా సక్సెస్ లో సైతం బ్రహ్మానందం కీలక పాత్ర పోషించారు.
ఈ సినిమాలో బ్రహ్మానందం పోషించిన బద్దం భాస్కర్ రోల్ ప్రేక్షకులను మెప్పించింది.వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన కృష్ణ, అదుర్స్( Adhurs ) సినిమాల సక్సెస్ లో బ్రహ్మానందం కీలక పాత్ర పోషించారు.అదుర్స్ లో భట్టు పాత్రకు ఈతరం ప్రేక్షకుల్లో సైతం ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకక్కిన కిక్, రేసుగుర్రం( Race Gurram ) సినిమాల సక్సెస్ లో బ్రహ్మానందం ముఖ్య పాత్ర పోషించారనే చెప్పాలి.
బ్రహ్మానందం ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.