వైరల్‌ : చంద్రబాబు ఓటమి, జగన్‌ గెలుపు గురించి బ్రహ్మంగారి కాల జ్ఞానంలోనే రాసి ఉంది

తెలుగు వారందరికి కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.కొన్ని వందల సంవత్సరాల క్రితమే పోతులూరి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఈ ప్రపంచంలో జరుగబోతున్న వింతలు, విచిత్రాలు, ముఖ్య సంఘటనలు, పకృతి విపత్తులను గురించి తన కాల జ్ఞానంలో రాయడం జరిగింది.

 Brahmamgari Kaalakaandi Jagan Paalana Soshal Midia Alo Viral-TeluguStop.com

ఎన్నో అద్బుతాలు ప్రపంచంలో ఆవిష్కారం అవుతాయి అంటూ బ్రహ్మంగారు చెప్పడం జరిగింది.ఆయన చెప్పినదాంటో ఎన్నో నిజం అయ్యాయి.

బ్రహ్మం గారి కాలజ్ఞానంను ప్రముఖులు కూడా నమ్ముతారు అంటే ఏ స్థాయిలో కాలజ్ఞానం నిజం అవుతుంది అనేది తెల్సిందే.

వైరల్‌ : చంద్రబాబు ఓటమి, జగన్‌

ఇక తాజాగా తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్‌లో అధికార బదిలికి సంబంధించిన విషయంను కూడా బ్రహ్మంగారు కాల జ్ఞానంలో అప్పట్లోనే రాశాడు అంటూ ఒక పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.ఆ వైరల్‌ పోస్ట్‌లో విషయం చదువుతుంటే వామ్మో నిజమే కదా అనిపిస్తుంది.అందులో చంద్ర పాలన పోయి రాజన్న పాలన వస్తుందని రాసి ఉంది.

వికారి సంవత్సరంలో ఆ మార్పు జరుగుతుంది.ప్రస్తుతం తెలుగు సంవత్సరాది ప్రకారం ఇది వికారి సంవత్సరం.

అంటే బ్రహ్మంగారు చెప్పింది నిజమే అన్నమాట కదా అంటూ ఆయన్ను నమ్మే వారు అంటున్నారు.

వైరల్‌ : చంద్రబాబు ఓటమి, జగన్‌

బ్రహ్మంగారి కాల జ్ఞానంలో ఏముందంటే… ధరణిలో వికారి సంవత్సరంబున తెలుగు రాష్ట్రమున మార్పులొచ్చేనయ.! చంద్ర దోశం నాడు వీడేనయ.! రాజన్న రాజ్యంబు వచ్చేనయ.! తప్పదు నా మాట నమ్మండయ.!! అంటూ ఒక స్లోకం ఉంది.

ప్రస్తుతం జరుగుతున్నది వికారి సంవత్సరం అవ్వడంతో తాజాగా చంద్రబాబు నాయుడు పాలన తొలగి పోయి రాజన్న కొడుకు అయిన జగన్‌ పాలన సాగబోతుంది.రాజశేఖర్‌ రెడ్డి హయాంలో జరిగిన పాలనను అంతా రాజన్న పాలన అంటారు.

ఇప్పుడు ఆయన కొడుకు జగన్‌ పాలనను కూడా రాజన్న పాలన అంటూ ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.అందుకే ప్రస్తుతం బ్రహ్మంగారు రాసిన ఆ కాలజ్ఞానం వైరల్‌ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube