మీ కులం వాడినంటూ అభిమాని ట్వీట్.. బ్రహ్మజీ ఏం అన్నాడంటే?

తెలుగు సినీ నటుడు బ్రహ్మాజీ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే.ఎన్నో సినిమాలలో నటించిన బ్రహ్మాజీ తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Fan Tweet Like Your Caste Brahmaji Shocking Reply, Fan Tweet,actor Brahmaji, Mov-TeluguStop.com

కెరీర్ మొదట్లో కొన్ని సినిమాలలో హీరోగా కూడా నటించాడు.ఆ తర్వాత సహాయ పాత్రలలో నటించి ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు బ్రహ్మాజీ.

నిన్నే పెళ్ళాడుతా, ఖడ్గం, మర్యాద రామన్న, మిరపకాయ్ వంటి పలు సినిమాలలో తన పాత్రలకు మంచి పేరు సంపాదించుకున్నాడు.ఇదిలా ఉంటే తాజాగా కులం పై షాకింగ్ ట్వీట్ చేశాడు బ్రహ్మాజీ.

సోషల్ మీడియా ప్రభావం బ్రహ్మాజీ పై కూడా ఎక్కువగానే ఉంది.ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో బాగా పంచుకుంటాడు.తనకు సంబంధించిన ఫోటోలను, కొన్ని ఫన్నీ వీడియోలను కూడా షేర్ చేస్తుంటాడు.అంతేకాకుండా ఈయనకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది.

ఇక కొన్ని విషయాల పట్ల కూడా బాగా స్పందిస్తుంటాడు బ్రహ్మాజీ.ఇదిలా ఉంటే తాజాగా ఓ నెటిజన్.

తనకు సినిమాలపై ఆసక్తి ఉండటంతో బ్రహ్మాజీకి ఓ ట్వీట్ చేశాడు.

Telugu Brahmaji, Brahmaji Reply, Fan Tweet, Indian, Ppa, Telugu, Tollywood-Movie

‘అన్నా నేను మన కమ్యూనిటీకి చెందినవాడిని.నాకు సినిమా ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం.మీ తరపున ఏ చిన్న అవకాశం ఉన్నా ఏదో ఒక పాత్రలో నటించే అవకాశాన్ని కలిగించగలరని మిక్కిలి కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశాడు.

ఇక ఆ వ్యక్తి చేసిన ట్వీట్ కు స్పందించిన బ్రహ్మాజీ.నేను ఇండియన్ ని, తెలుగోడిని, అదే నా కమ్యూనిటీ అంటూ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.

Telugu Brahmaji, Brahmaji Reply, Fan Tweet, Indian, Ppa, Telugu, Tollywood-Movie

అవకాశం కావాలంటే అడగాలి కానీ.కులం గిలం ఏంట్రా నాయనా అంటూ గట్టిగా స్పందించాడు.ఇక ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు బ్రహ్మాజీ మాటలకు ఫిదా అయ్యారు.ఇక ప్రస్తుతం బ్రహ్మాజీ వరుస సినిమాలలో బిజీగా ఉన్నాడు.తాజాగా విడుదలైన నారప్ప సినిమాలో కూడా నటించగా తన పాత్రకు మంచి ప్రశంసలు అందాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube