స్కర్ట్ వేసుకున్న హాలీవుడ్ హీరో.. నా బట్టలు నా ఇష్టం అంటూ?

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు హీరోయిన్లు డ్రెస్సింగ్ విషయంలో ట్రోలింగ్స్ ని ఎదుర్కొంటూ ఉంటారు.విచిత్రమైన దుస్తులను ధరించి ట్రోల్స్ ని ఎదుర్కొంటూ ఉంటారు.

 Brad Pitt Explains Why He Wore Skirt Bullet Train Red Carpet, Brad Pitt, Skirt On Bullet Train, Brad Pitt, Explanation, Wearing, Skirt, Bullet Train, Premiere Show, Red Carpet,brad Pitt Skirt-TeluguStop.com

అయితే ఇలా డ్రెస్సింగ్ విషయంలో హీరోలు చాలా తక్కువగా ట్రోలింగ్స్ ని ఎదుర్కొంటూ ఉంటారు.ఇక హీరోలలో ఎక్కువగా ట్రోల్స్ కీ గురి అయిన వారిలో బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ ఒకరు.

అయితే తాజాగా హాలీవుడ్ హీరో కూడా ఇదే విధంగా డిఫరెంట్ డ్రెస్సింగ్ వేర్ తో దర్శనమిచ్చి సోషల్ మీడియాలో నిలిచాడు.ఆ హాలీవుడ్ హీరో మరెవరో కాదు ఆస్కార్ విన్నర్ బ్రాడ్ పిట్.

 Brad Pitt Explains Why He Wore Skirt Bullet Train Red Carpet, Brad Pitt, Skirt On Bullet Train, Brad Pitt, Explanation, Wearing, Skirt, Bullet Train, Premiere Show, Red Carpet,brad Pitt Skirt-స్కర్ట్ వేసుకున్న హాలీవుడ్ హీరో.. నా బట్టలు నా ఇష్టం అంటూ-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇతను యాక్షన్ సినిమాలతో వరల్డ్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకున్నాడు.

ఇతనికి హాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు బాలీవుడ్ బాలీవుడ్ లో కూడా మంచి పాపులారిటీ ఉంది.

కాగా కేవలం సినిమాల విషయంలో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు విచిత్రమైన ప్రవర్తనతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు బ్రాడ్ పిట్.ఇకపోతే బ్రాడ్ పిట్ తాజాగా నటించిన చిత్రం బుల్లెట్ ట్రైన్.

ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా ఈ సినిమాకు విడుదలకు ముందుగానే పలుదేశాల్లో ప్రీమియర్ షో లను వేస్తున్నారు.

ఈ క్రమంలోని ఇటీవల బెర్లిన్ లో బుల్లెట్ ట్రైన్ ప్రీమియర్ షోలో ప్రదర్శించారు.ఈ షో కోసం వేసిన రెడ్ కార్పెట్ పై స్కర్ట్ వేసుకుని వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు హీరో బ్రాడ్ పిట్.

Telugu Brad Pitt, Bullet Train, Premiere Show, Red Carpet-Latest News - Telugu

మోకాళ్ల వరకు ఉన్న స్కర్ట్,బూట్లు వదులుగా ఉండే షర్ట్, జాకెట్ తో దర్శనమిచ్చాడు.ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అంతేకాకుండా బ్రాడ్ పిట్ వేసుకున్న కాస్ట్యూమ్ పై ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చనే జరిగింది.ఈ విషయం పై తాజాగా లాస్ ఏంజెల్స్ తో జరిగిన మూవీ ప్రీమియర్ షోలో స్పందించాడు బ్రాడ్ పిట్.

తన డ్రెస్సింగ్ విషయం పై స్పందిస్తూ.బెర్లిన్ అలా ఎందుకు చేసానో నాకు కూడా సరిగ్గా తెలియదు.

కానీ త్వరలో మనమందరం చనిపోతాం.అందుకే కాస్త డిఫరెంట్ గా చేద్దామని అనిపించింది.

అందుకే స్కర్ట్ వేసుకున్నాను అంటూ వివరణ ఇచ్చాడు బ్రాడ్ పిట్.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube