'ఆర్ఆర్ఆర్' నుండి మరో పవర్ ప్యాక్డ్ ప్రోమో.. ట్రెండ్ సెట్ చేస్తున్నాడుగా!

Brace Yourself For Bheem New Promo From Rrr

టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై దేశ వ్యాప్తంగా అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.ఇక ఈ అంచనాలను రెట్టింపు చేస్తూ రాజమౌళి తన ప్లాన్ ను చేస్తున్నాడు.

 Brace Yourself For Bheem New Promo From Rrr-TeluguStop.com

ఇక డిసెంబర్ 9న ట్రైలర్ విడుదల చేస్తున్న నేపథ్యంలో రోజు వరుస అప్డేట్ లతో అభిమానుల దృష్టిని ఆకర్షించడానికి రాజమౌళి పక్క ప్లాన్ తో వస్తున్నాడు.ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలను పెంచేస్తూ అందరి దృష్టిని తమవైపుకు తిప్పుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు జక్కన్న.

ఇక నిన్న ఈ సినిమా నుండి వరుసగా రామ్ చరణ్, ఆలియా , అజయ్ దేవగన్ పాత్రల బీటీఎస్ వీడియోలను షేర్ చేసారు.రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఆలియా సీతగా ప్రిపరేషన్, అజయ్ దేవగన్ పవర్ ఫుల్ పాత్రలను వీడియోల రూపంలో విడుదల చేసి మరింత హుషారు పెంచేశారు.

 Brace Yourself For Bheem New Promo From Rrr-ఆర్ఆర్ఆర్’ నుండి మరో పవర్ ప్యాక్డ్ ప్రోమో.. ట్రెండ్ సెట్ చేస్తున్నాడుగా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ మేకర్స్ మరొక కొత్త ప్రోమోను విడుదల చేసారు.

ఈ రోజు ఆర్ ఆర్ ఆర్ మేకర్స్ ఈ సినిమా నుండి మరో పవర్ ప్యాక్డ్ ప్రోమోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి ట్రెండ్ సెట్ చేస్తున్నాయి.బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ భీం అంటూ ఒక ప్రోమోను విడుదల చేసారు.దీంతో రేపు విడుదల అవ్వబోయే  ట్రైలర్ పై మరిన్ని అంచనాలు పెంచేసింది.

ఇక ఈ సినిమాను రాజమౌళి 1920 కి ముందు స్వాతంత్ర  సమయంలో తెరకెక్కుతున్న కల్పిత కథతో తెరకెక్కిస్తున్నానని ఎప్పుడో చెప్పారు.

ఎన్టీఆర్ ఇందులో కొమరం భీమ్ గా నటిస్తుంటే. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.చరణ్ కు జోడీగా ఆలియా భట్ నటిస్తుంటే, ఎన్టీఆర్ కు జంటగా ఒలీవియా మోరిస్ నటిస్తుంది.

దానయ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తుండగా కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న రాబోతున్న విషయం తెలిసిందే.

#RRR #BraceBheem #Ram Charan #RRR Promo #RRR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube