ఇన్స్టా రీల్ లో హీరోలమైపోదామని ప్లాన్ చేసిన కుర్రాళ్ళు.. విలన్స్ గా మారిన పోలీసులు!

సోషల్ మీడియా పరిధి విస్తరిస్తున్నవేళ వింత పోకడలు చోటు చేసుకుంటున్నాయి.పాపులర్ అవ్వాలనే ఉద్దేశంతో కొంతమంది యువకులు చేసిన చేష్టలు హద్దులు మీరుతున్నాయి.

 Boys Who Planned To Become Heroes In Insta Reel Police Who Became Villains Ins-TeluguStop.com

ఈ క్రమంలో వారిని వారు రిస్కుతో పెట్టుకోవడమేకాకుండా ఎదుటివారిని సైతం రిస్కుతో పెడుతున్నారు.తాజాగా కొందరు యువకులు కలిసి సరదాగా వీడియో తీసుకున్నారు.

తీసుకున్న వీడియోని Instagram Reelలో షేర్ చేయడంతో చివరకు పోలీసుల దృష్టికి వెళ్లింది.ఇంకేముంది, కట్ చేస్తే ఫైన్ చెల్లించుకోవలసి పరిస్థితి వచ్చింది.

వివరాల్లోకి వెళితే, కేరళలోని ఇడుక్కి ప్రాంతంలో జరిగిన ఘటన ఆలస్యంగా చోటు చేసుకుంది.BBA సెకండ్ ఇయర్ చదువుతున్న 5 మంది విద్యార్థులు కలిసి Instagramలో వీడియోలు చేస్తుంటారు.

ఈ క్రమంలో వినూత్నంగా వీడియోలు చేసి, ఫేమస్ అవ్వాలని నిర్ణయించుకున్నారు.దాంతో ఐదుగురు యువకులు కలిసి ఒకే స్కూటర్‌పై ఒకరి వెనుక ఒకరు కూర్చుని.

డ్యాన్స్ చేస్తూ ప్రమాదకర స్థితిలో డ్రైవింగ్ చేశారు.అనంతరం వీడియోను Instagram ఖాతాలో షేర్ చేశారు.

వీడియో వైరల్ అవడంతో పోలీసుల వరకు వెళ్లింది.దాంతో పోలీసులు వారిపైన సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.వారిలో ముగ్గురు యువకుల లైసెన్స్‌ను 3నెలల పాటు సస్పెండ్ చేసి, రూ.2,000 జరిమానా విధించారు.అలాగే మెడికల్ కళాశాలలో 2 రోజుల పాటు సామాజిక సేవ చేయాలని ఆదేశించారు.అక్కడితో ఆగకుండా విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి, కౌన్సెలింగ్ ఇచ్చారు.ఇలాంటి వింత పోకడలకు ఇకనుండి వెళ్లబోమని వారినుండి సంతకాలు కూడా పోలీసులు తీసుకోవడం ఇక్కడ కొసమెరుపు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube