రకుల్ డాన్స్ వీడియో పై స్పందించిన ప్రియుడు.. జాకీ ట్వీట్ వైరల్!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ఉత్తరాది సినీ ఇండస్ట్రీలో కూడా నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం వరుస బాలీవుడ్ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇకపోతే ఆయన సినిమాలో షూటింగులు కూడా పూర్తి కావడంతో ప్రస్తుతం ఈమె ఎలాంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

 Boyfriend Responds To Rakul Dance Video Jockey Tweet Goes Viral Rakul Preet Singh, Tollywood, Boyfriend, Jockey, Tweet Viral-TeluguStop.com

ఇక తెలుగులో ఈమె వైష్ణవ్ తేజ్ సరసన నటించిన కొండపొలం సినిమాతో డిజాస్టర్ ఎదుర్కొన్న రకుల్ తెలుగులో ఇప్పటివరకు ఎలాంటి సినిమాలను ప్రకటించలేదు.

ఇక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా లేనటువంటి రకుల్ ప్రీత్ సింగ్ ఒక డాన్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

 Boyfriend Responds To Rakul Dance Video Jockey Tweet Goes Viral Rakul Preet Singh, Tollywood, Boyfriend, Jockey, Tweet Viral-రకుల్ డాన్స్ వీడియో పై స్పందించిన ప్రియుడు.. జాకీ ట్వీట్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ వీడియో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఇటీవల సెలబ్రెటీ డాన్స్ కొరియోగ్రాఫర్ డింపుల్ వద్ద రకుల్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.

ఇకపోతే యూట్యూబ్ లో అత్యధికంగా వ్యూస్ దక్కించుకున్న సెన్సేషనల్ సాంగ్ పసూరి పాటకు కాలు కదిపింది.ఈ క్రమంలోనే ఈ డాన్స్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మై ఫేవరెట్ సాంగ్ అనే క్యాప్షన్ జోడించారు.

ఇక ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ వీడియో పై స్పందిస్తూ కామెంట్లు చేయడమే కాకుండా లైకుల వర్షం కురిపిస్తున్నారు.ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ కి డాన్స్ వీడియో పై తన ప్రియుడు జాకీ భగ్నానీ స్పందిస్తూ.మై డియర్ లవ్ నాక్కూడా నేర్పించవా అంటూ కామెంట్ పెట్టారు.ఇక ఈ కామెంట్ వైరల్ అవుతుంది.రకుల్ ఈ డాన్స్ వీడియోని షేర్ చేసిన గంటల వ్యవధిలోనే ఏకంగా మూడు లక్షలకు పైగా వ్యూస్ సాధించుకుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube