బాయ్‌ఫ్రెండ్‌ను అద్దెకు ఇస్తోన్న బ్యూటీ

టాలీవుడ్‌లో విభిన్న కథాంశాలతో తెరకెక్కుతున్న చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ పట్టం కడుతూ వస్తున్నారు.ఇక ఇటీవల కాలంలో చిన్న బడ్జెట్ చిత్రాలు తమదైన కంటెంట్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంలో సక్సె్స్ అవుతుండటంతో దర్శకనిర్మాతలు ఈ తరహా చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

 Boyfriend For Hire First Look Poster Impresses, Boyfriend For Hire, Malavika Sat-TeluguStop.com

కాగా తాజాగా ఇలాంటి కోవలోనే ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ అనే సినిమా తెరకెక్కుతోంది.విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవికా సతీషన్ హీరోహీరోయిన్లుగా ఈ సినిమా వస్తుండగా, తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

పోస్టర్ ఆసక్తికరంగా ఉండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.సాధారణంగా తమ గర్ల్‌ఫ్రెండ్‌ను బాయ్‌ఫ్రెండ్ ఎత్తుకుంటారు.కానీ ఈ సినిమాలో రివర్స్‌లో జరుగుతుంది.తన బాయ్‌ఫ్రెండ్‌ను భుజంపై ఎత్తుకుంది హీరోయిన్ మాళవిక.

అంతేగాక అతడిని అద్దెకు ఇస్తానంటూ ఈ సినిమా క్రేజీ టైటిల్‌తో సోషల్ మీడియాలో ఈ పోస్టర్ చక్కర్లు కొడుతోంది.సంతోష్ కంభంపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తవగా, సరైన సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

ఇక ఈ సినిమాలో బిగ్‌బాస్ ఫేం పూజా రామచంద్రన్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది.
పూర్తి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాలో ప్రేమికుల మధ్య సాగే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, వేణు మాధవ్ పెద్ది సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.తమ సినిమాలోని కంటెంట్ ఈ జెనరేషన్ ఆడియెన్స్‌ను ఖచ్చితంగా మెప్పి్స్తుందని వారు అంటున్నారు.

మరి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఆకట్టుకుంటున్న ఈ సినిమా రిలీజ్ తరువాత ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube