వైరల్‌ : ప్రియురాలికి వింతగా లవ్‌ ప్రపోస్‌ చేయాలని నీటిలో దిగి ప్రాణాలే కోల్పోయాడు  

Boyfriend Drowns During Underwater Proposal His Love To Girl Friend-east Africa,stiven Viber,tusiyana

ప్రేమించిన ప్రియురాలి మనసు గెలుచుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.అందులో మొదటగా ప్రపోస్‌ చేసే సమయంలో చాలా విభిన్నంగా ఉండాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు.

Boyfriend Drowns During Underwater Proposal His Love To Girl Friend-East Africa Stiven Viber Tusiyana

ఆ క్రమంలో కొందరు ఏకంగా ప్రాణాలతో చెలగాటం ఆడుతూ మరీ ప్రపోస్‌ చేస్తారు.కొందరు రక్తంతో లెటర్‌ రాస్తే మరి కొందరు సాహసాలు చేస్తూ ప్రేమను తెలియజేస్తూ ఉంటారు, మరి కొందరు ఆమె కోసం ఏమైనా చేస్తామని నిరూపించేందుకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.

ఇటీవల అమెరికాలోని లూసియానాకు చెందిన స్టీవెన్‌ వీబర్‌ అనే వ్యక్తి తన ప్రియురాలిని ఆశ్చర్య పర్చాలనే ఉద్దేశ్యంతో ప్రాణాలతో చెలగాటం ఆడాడు, చివరకు ప్రాణాలు కోల్పోయాడు.

Boyfriend Drowns During Underwater Proposal His Love To Girl Friend-East Africa Stiven Viber Tusiyana

  టూసియానాకు చెందిన స్టీవెన్‌ వీబర్‌ మరియు అతడి ప్రియురాలు కలిసి ఇటీవల తూర్పు ఆఫ్రికాలోని టాంజానియాలో హాలీడేస్‌కు వెళ్లారు.అక్కడ సముద్రం మద్యలో ఉండే ఒక హోటల్‌లో దిగారు.నీటిపై సగం నీటి అడుగున సగం ఆ హోటల్‌ ఉంటుంది.

అత్యంత సుందరంగా ఉండే ఆ హోటల్‌లో ఈ జంట ఎంజాయ్‌ చేస్తూ ఉంది.ఆ సమయంలోనే తన ప్రేమ విషయాన్ని చెప్పి పెళ్లికి ఒప్పించాలని నిర్ణయించుకున్నాడు.

ప్రియురాలికి విభిన్నంగా ప్రపోస్‌ చేయాలని వీబర్‌ భావించాడు.

  అందుకోసం ఆమెను హోటల్‌లోని కింది అంతస్తు నీటిలో ఉంటుంది.అక్కడకు పంపించాడు.అక్కడ ఆమె వెయిట్‌ చేస్తుండగా నీటిలో వీబర్‌ దూకి ఆమె ఉన్న రూం వైకు వచ్చాడు.

ఆ రూంలో అద్దం ఉంది.ఆ అద్దం నుండి వీబర్‌ కనిపిస్తున్నాడు.ఆమెకు వీబర్‌ తన ప్రేమను తెలియజేసేందుకు ఒక పేపర్‌ను చూపించాడు.ఆ పేపర్‌లో నీవంటే ఇష్టం ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని ఉంది.

ఆ లెటర్‌ చూపించిన తర్వాత వీబర్‌ తన జేబులో ఉన్న రింగ్‌ను తీసి చూపించాడు.ఆ వెంటనే బయటకు రావాలని భావించాడు.కాస్త దూరం పైకి వచ్చిన తర్వాత అతడు ఊపిరి ఆడక స్పృహకోల్పోయాడు.

  వీబర్‌ ప్రపోజల్‌కు ఓకే చెప్పాలని భావించిన ప్రియురాలు పరుగు పరుగున బయటకు వచ్చింది.నీటిలోంచి వీబర్‌ బయటకు రాలేదు.దాంతో భయపడ ఆమె వెంటనే హోటల్‌ సిబ్బందికి తెలియజేశారు.

అతడి మృత దేహంను వారు గుర్తించారు.ఆమె కన్నీరు పెట్టుకుంది.నీ ప్రపోజల్‌కు నేను సమాధానం చెప్పలేక పోయాను, ఇప్పుడు చెబుతున్నాను.నీవంటే నాకు ఇష్టం నీతో జీవితం గడిపేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాను.

ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటూ ఒక లేఖ రాసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

వీరిద్దరి వింత ప్రేమ కథ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

కాని అతడి లవ్‌ ప్రపోజల్‌ పద్దతిపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఇలాంటి చెత్త పనులు చేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్రాణాల మీదకు తెచ్చుకుని లవ్‌ ప్రపోజల్‌ ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు.

.

తాజా వార్తలు

Boyfriend Drowns During Underwater Proposal His Love To Girl Friend-east Africa,stiven Viber,tusiyana Related....