'బాయ్ కాట్ రాధే' అంటున్న నెటిజన్స్.. కారణం ఏంటంటే..!

బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్ వరస బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకు పోతున్నాడు.ప్రస్తుతం ఈయన ‘రాధే‘ సినిమాలో నటించాడు.

 Boycott Radhe Tag Trending In Social Media-TeluguStop.com

డాన్స్ మాస్టర్ ప్రభుదేవా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కించాడు ప్రభుదేవా.

కరోనా కారణంగా ఇప్పటి వరకు ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది.తాజాగా ఈ సినిమాను రంజాన్ కానుకగా మే 13 న విడుదల చేసారు.

 Boycott Radhe Tag Trending In Social Media-బాయ్ కాట్ రాధే’ అంటున్న నెటిజన్స్.. కారణం ఏంటంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నిన్ననే ఈ సినిమా జీ 5 లో స్ట్రీమింగ్ అయ్యింది.

ఈ సినిమాను థియేటర్స్ లోను ఓటిటి లోనూ ఒకే రోజు విడుదల చేయాలనీ ముందుగానే అనుకున్నారు.

అయితే కరోనా ఉదృతి ఎక్కువుగా ఉండడం వల్ల థియేటర్స్ లో విడుదల అవ్వలేదు.కానీ చెప్పిన విధంగానే ఓటిటీ లో మాత్రం విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డీజే సినిమాలోని సిటీమార్ పాటను రాధే సినిమాలో రీమేక్ చేసారు.

దీంతో ఈ సినిమాపై తెలుగులో కూడా మంచి హైప్ వచ్చింది.సీటిమార్ సాంగ్ కు దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోయిందని చెప్పాలి.సల్మాన్ ఖాన్ ఈ సాంగ్ కు స్టెప్పులు కూడా వేసాడు.సల్మాన్ కంటే దిశా పటాని డాన్స్ ఇరగదీసింది.ఇది ఇలా ఉండగా ఈ సినిమా విడుదల అయ్యి భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది.మరొకసారి సల్మాన్ ఖాన్ తన స్టామినా నిరూపించుకున్నాడు.

అయితే ఈ సినిమాపై నేపోటిజం సెగ బాగానే తగులుతుంది.ఈ సినిమాను బ్యాన్ చెయ్యాలని కొంతమంది నెటిజన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.

గత సంవత్సరం మరణించిన సుశాంత్ సింగ్ రాజపుత్ ఫ్యాన్స్ ఈ సినిమాను బ్యాన్ చేయాలనీ బాయ్ కాట్ రాధే’ ట్యాగ్ పేరుతొ ట్రెండ్ చేస్తున్నారు.ఇంతకు ముందు కూడా చాలా సినిమాలకు ఈ నేపోటిజం సెగ తగిలింది.

ఇప్పుడు రాధే సినిమాకు కూడా ఇలానే జరుగుతుంది.

#BoycottRadhe #Social Media #Salman Khan #Disha Patani #Boycott Radhe

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు