వివి వినాయక్‌ దారిలో బోయపాటి మరీ పరిస్థితి ఇలా అవుతుందనుకోలేదు

యాక్షన్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన వివి వినాయక్‌ ఎన్నో యాక్షన్‌ చిత్రాలను తెరకెక్కించి పలువురు హీరోలకు బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లను ఇచ్చిన విషయం తెల్సిందే.అయితే ఉన్నట్లుండి వినాయక్‌ కెరీర్‌ కష్టాల్లో పడ్డట్లయ్యింది.

 Boyapti Srinu No Moviesin Hand 1-TeluguStop.com

ఒకటి రెండు సినిమాలు బొక్క బోర్లా పడటంతో వెంటనే వినాయక్‌ కెరీర్‌ కష్టాల్లో కూరుకు పోయింది.ప్రస్తుతం వినాయక్‌ను నమ్మి సినిమాను చేసేందుకు స్టార్‌ హీరోలు కాని, నిర్మాతలు కాని ముందుకు రావడం లేదు.

ప్రస్తుతం వినాయక్‌ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు.

వినాయక్‌ తరహాలోనే ప్రస్తుతం బోయపాటి కూడా అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు.‘వినయ విధేయ రామ’ చిత్రానికి ముందు బోయపాటి అంటే ఒక బ్రాండ్‌.యాక్షన్‌ సినిమాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ టైప్‌లో మనోడు మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.

కాని ప్రస్తుతం అతడితో సినిమా అంటేనే చిన్న హీరో నుండి పెద్ద హీరోల వరకు అంతా బాబోయ్‌ అంటున్నారు.ఆయన యాక్షన్‌ ఏ స్థాయిలో ఉంటుందో వినయ విధేయ రామ చిత్రంలో చూడటం జరిగింది.

వివి వినాయక్‌ దారిలో బోయపాటి �

మరీ ఓవర్‌ యాక్షన్‌ అంటూ ఆ సినిమాపై విమర్శలు వెళువెత్తాయి.అత్యంత భారీ పారితోషికంను మొన్నటి వరకు తీసుకున్న బోయపాటికి ప్రస్తుతం అందులో సగం పారితోషికం ఇచ్చేందుకు కూడా నిర్మాతలు ముందుకు రావడం లేదు.వినాయక్‌ తరహాలోనే బోయపాటి కూడా మెల్ల మెల్లగా కనుమరుగవుతాడేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.వినాయక్‌ అయినా నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.మరి బోయపాటి పరిస్థితి ఏంటో మరి?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube