Ram Pothineni :రామ్ ని ఊరమాస్ హీరోగా మార్చేసిన బోయపాటి.. ఫొటోస్ వైరల్?

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని( Ram Pothineni ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.హీరో రామ్ పోతినేని గత ఏడాది ది వారియర్( The Warrior ) సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

 Ram Pothineni :రామ్ ని ఊరమాస్ హీరోగా మా�-TeluguStop.com

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ గా నిలిచింది.

డైరెక్టర్ లింగు స్వామి( Lingu Swami) ఈ సినిమాలో ఇంకొంచెం కొత్తదనాన్ని యాడ్ చేసి ఉంటే బాగుండేదని అభిమానులు అభిప్రాయపడ్డారు.ఇకపోతే ఈ సినిమా తర్వాత రామ్ పోతినేని ఎలా అయినా తదుపరి సినిమాతో సక్సెస్ సాధించాలని ప్రయత్నిస్తున్నాడు.

Telugu Boyapati Srinu, Lingu Swami, Ram Pothineni, Sri Leela, Warrior, Tollywood

ఈ క్రమంలోనే డైరెక్టర్ బోయపాటి శ్రీను( Boyapati Srinu ) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు.కాగా ఈ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం వారి కాంబినేషన్ గురించి మాట్లాడుకునేలా చేశారు బోయపాటి.చాక్లెట్ బాయ్ హీరోగా మార్చేశాడు బోయపాటి.ఇక ఈ సినిమాతో ఊర మాస్ హీరోగా పరిచయం కాబోతున్నాడు రామ్ పోతినేని.బోయపాటి సినిమాల గురించి మనందరికీ తెలిసిందే.

డైరెక్టర్లలో మాస్ కి మొగుడు అంటే ముందుగా బోయపాటి పేరే వినిపిస్తూ ఉంటుంది.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Telugu Boyapati Srinu, Lingu Swami, Ram Pothineni, Sri Leela, Warrior, Tollywood

ఇందులో రామ్ సరసన శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది.ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వని చిత్ర బృందం తాజాగా ఏకంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించి అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది.ఈ సినిమాను ఈ ఏడాది అనగా 2023 అక్టోబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు చిత్ర బృందం.తాజాగా విడుదల చేసిన ఆ రిలీజ్ పోస్టర్లో రామ్ పోతినేని ఊర మాస్ లుక్కులో కనిపించగా గుబురుగా గడ్డం, గాగుల్స్ సీరియస్ లుక్ తో ఒక దున్నపోతును లాకెళ్తూ కనిపించాడు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రామ్ పోతినేని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కాగా ఆ పోస్టర్ని బట్టి చూస్తే బోయపాటి శ్రీను రామ్ ని ఫుల్ గా వాడేసుకున్నట్లు తెలుస్తోంది.

అఖండ సినిమా తర్వాత బోయపాటి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube