బాలయ్య కి ఒకేసారి 3 కథలు చెప్పిన బోయపాటి...ఏది ఒకే అయిందంటే..?

కొన్ని కాంబినేషన్లకి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంటుంది.అందులో ముఖ్యంగా బోయపాటి బాలయ్య కాంబినేషన్ కి అయితే అదిరిపోయే రెస్పాన్స్ ఉంది.

 Boyapati Who Told Stories To Balayya At The Same Time Which One Is The Same Bal-TeluguStop.com

అలాగే అభిమానులతో పాటు,సగటు ప్రేక్షకులు కూడా వీళ్ళ కాంబో లో సినిమా వస్తుందంటే బ్రహ్మారథం పడతారు.ఇక బోయపాటి మిగతా హీరోలతో ఎలాంటి సినిమా చేసిన కూడా బాలకృష్ణ తో సినిమా అంటే మాత్రం తన రెచ్చిపోయి డైలాగులు చెప్పిస్తూ, ఫైట్లు చేయిస్తూ ప్రేక్షకుల్లో మంచి ఊపు తెప్పిస్తాడు.

మూడుసార్లు సక్సెస్ లు సాదించిన ఈ కాంబో ఇప్పుడు నాలుగోవ సారి కూడా మళ్ళీ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.వీళ్ళ కాంబో వచ్చిన సినిమాలు వరుసగా హిట్లు సాధించడమే కాకుండా హ్యాట్రిక్ హిట్ల ను నమోదు చేసుకున్నాయి.

 Boyapati Who Told Stories To Balayya At The Same Time Which One Is The Same Bal-TeluguStop.com

ఇక ఈ సినిమా అఖండ కి సీక్వెల్ గా వస్తుందా లేదా ఫ్రెష్ కథతో వస్తుందా అనేది ఇంకా క్లారిటీ లేదు అయితే బాలయ్య మాత్రం ఫ్రెష్ కథతో వెళ్దామని అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

Telugu Akhanda, Balayya, Bobby, Boyapati Sreenu, Tolly Wood-Movie

అందులో భాగంగా బాలయ్య కి మూడు కథలు చెప్పిన బోయపాటి ఏ కథ తో వెళ్దామనే డైలమాలో పడ్డట్టుగా తెలుస్తుంది.ఇక ఈ మూడు కథలు బాలయ్య బాబుకి నచ్చడంతో ఇప్పుడు ఏ కథను ఫైనల్ చేసి ప్రేక్షకులకు ముందుకు వస్తారు అనేది ఆసక్తికరంగా మారింది… ఇదిలా ఉంటే బాలయ్య బాబు ప్రస్తుతం బాబి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.ఇది కనక సక్సెస్ అయితే బాలయ్యకి ఇక తిరుగు ఉండదు.

వరుసగా ఇప్పటికీ మూడు సినిమాలు హిట్లు కొట్టి హ్యాట్రిక్ హిట్లు కొట్టిన సీనియర్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇక ఇప్పుడు బాబీ సినిమాతో హిట్టు పడితే దాని తర్వాత వచ్చే బోయపాటి సినిమా ఎలాగూ హిట్టు పడుతుంది కాబట్టి వరుసగా ఐదు సినిమాలను హిట్లు కొట్టిన సీనియర్ హీరో గా ఎవరికి సాధ్యం కానీ రికార్డ్ ను తన పేరు మీద నెలకొల్పడానికి బాలయ్య బాబు రెడీ అవుతున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube