బోయపాటికి బకరా దొరికినట్లేనా?  

Boyapati Srinu Starting A Movie With Nikhil Gowda -

వినయ విధేయ రామ’ చిత్రంకు ముందు బోయపాటి శ్రీనుతో చిరంజీవి మరియు బాలకృష్ణ వంటి స్టార్స్‌ సినిమాలు చేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నారు.కాని ఎప్పుడైతే ఆ సినిమా వచ్చిందో బోయపాటికి మొహం చూపించేందుకు కూడా హీరోలు ఆసక్తి చూపడం లేదు.

Boyapati Srinu Starting A Movie With Nikhil Gowda

చిరంజీవి బాలయ్య బాబు మాత్రమే కాకుండా ఇంకా చిన్న హీరోలు కూడా ఎక్కడ సినిమా అడుగుతాడో అంటూ దూరంగా వెళ్లి పోతున్నారట.ఇలాంటి సమయంలో అల్లు అరవింద్‌ నుండి కాల్‌ అయితే వచ్చింది కాని అందుకు కనీసం రెండేళ్లు పడుతుందని అన్నాడట.

దాంతో అప్పటి వరకు మళ్లీ తనను తాను నిరూపించుకోవాలని బోయపాటి ప్రయత్నాలు చేస్తున్నాడు.

బోయపాటికి బకరా దొరికినట్లేనా-Movie-Telugu Tollywood Photo Image

గతంలో తన వద్దకు వచ్చిన నిఖిల్‌ గౌడతో ఇప్పుడు సినిమా చేయాలని బోయపాటి ప్రయత్నిస్తున్నాడు.గతంలో భారీ పారితోషికం ఆఫర్‌ చేసి మరీ బోయపాటి వద్దకు నిఖిల్‌ గౌడ వచ్చాడట.కాని అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో నిఖిల్‌ ఆ సినిమాను చేయలేదు.

ఇప్పుడు నిఖిల్‌ గౌడతో సినిమాకు బోయపాటి ఒప్పుకున్నట్లుగా సమాచారం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక తెలుగు సినిమా వీరిద్దరి కాంబోలో తెరకెక్కబోతుంది.

నిఖిల్‌ గౌడ ఇప్పటికే కన్నడ మరియు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం.ఈయన చేసిన సినిమా జాగ్వర్‌ ఆకట్టుకోక పోయినా కూడా మాజీ ప్రధాని మనవడు అనే ఉద్దేశ్యంతో అంతా కూడా ఈయన గురించి తెలుసుకున్నారు.అటువంటి నిఖిల్‌తో ఒక సినిమాను బోయపాటి ప్లాన్‌ చేశాడు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి.త్వరలోనే సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Boyapati Srinu Starting A Movie With Nikhil Gowda- Related....