మోక్షజ్ఞను మోయడం నా వల్ల కాదంటూ చేతులెత్తేసిన బోయపాటి.. బాలయ్య తక్షణ కర్తవ్యం ఏంటి?     2019-01-07   12:42:18  IST  Ramesh Palla

బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాది ఖాయంగా కనిపిస్తుంది. అయితే నందమూరి వారసుడు ఎవరి దర్శకత్వంలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే విషయమై క్లారిటీ లేదు. ఎంతో మంది దర్శకుల పేర్లను పరిశీలించిన బాలకృష్ణ చివరకు బోయపాటి అయితేనే మోక్షజ్ఞను గట్టిగా పరిచయం చేస్తాడని బాలయ్య భావించాడట. కాని బోయపాటి మాత్రం మోక్షజ్ఞను పరిచయం చేసేందుకు ఆసక్తిగా లేడని తేలిపోయింది. తాజాగా ఆయన మాట్లాడుతూ మోక్షజ్ఞ తో మూవీపై ఫుల్‌ క్లారిటీ ఇచ్చాడు.

బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయ రామ చిత్రం సంక్రాంతి కానుకగా మరో మూడు రోజుల్లో విడుదల కాబోతుంది. ఆ నేపథ్యంలోనే బోయపాటి ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోక్షజ్ఞతో మూవీపై మాట్లాడాడు. మోక్షజ్ఞ మొదటి సినిమాకు మీరు దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరుగుతోంది.

Boyapati Srinu Not Doing With Mokshagna In His Next Movie-Balakrishna Son Boyapati Movie New

Boyapati Srinu Not Doing With Mokshagna In His Next Movie

ఆ వార్తల్లో నిజం ఎంతా అంటూ ప్రశ్నించిన సమయంలో అందులో ఏమాత్రం నిజం లేదని, అసలు తనకు ఆ ఉద్దేశ్యం లేదని చెప్పుకొచ్చాడు.

Boyapati Srinu Not Doing With Mokshagna In His Next Movie-Balakrishna Son Boyapati Movie New

నా దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి సినిమా తెరకెక్కితే అంచనాలు భారీగా ఉండే అవకాశం ఉంది. ఆ అంచనాలను కొత్త హీరో అందుకోవడం సాధ్యం కాదు. మొదటి సినిమాకే అంతగా అంచనాలుంటే ఫలితం మారు మారు అయ్యే అవకాశం ఉంది. అందుకే నా దర్శకత్వంలో మోక్షజ్ఞ మూవీ అతడికే మంచిది కాదని తేల్చి చెప్పాడు. మోక్షజ్ఞ మొదటి సినిమాను మాస్‌ ఎలిమెంట్స్‌తో కాకుండా క్లాస్‌గా చేస్తే బాగుంటుందనే అభిప్రాయంను కూడా బోయపాటి వ్యక్తం చేశాడు. మరి బాలయ్య నిర్ణయం ఏంటో చూడాలి.