బోయపాటి నెక్స్ట్ సినిమా ఆ హీరోతోనే అట !

బోయపాటి శ్రీను అంటే అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన తీసే యాక్షన్ సినిమాలు.భద్ర సినిమా తో తన జర్నీ మొదలుపెట్టి తన కెరీర్ లో చాలా సూపర్ హిట్ సినిమాలు తీసాడు.

 Boyapati Srinu Next Movie With Ravi Teja-TeluguStop.com

కానీ రామ్ చరణ్ తో తీసిన వినయ విధేయ రామ తో బోయపాటి శ్రీను కు పెద్ద దెబ్బ తగిలింది.ఈ సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడంతో బోయపాటి యాక్షన్ సినిమాలంటేనే స్టార్ హీరోలు భయపడే పరిస్థితి నెలకొంది.

ఈ సినిమా వల్ల రామ్ చరణ్ కూడా చాలా డిస్సపాయింట్ అయ్యాడు.ఈ సినిమా తర్వాత బోయపాటి ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా అఖండ సినిమా చేస్తున్నాడు.

 Boyapati Srinu Next Movie With Ravi Teja-బోయపాటి నెక్స్ట్ సినిమా ఆ హీరోతోనే అట -Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాలయ్య, బోయపాటి కాంబినేషన్ అంటే పెద్ద అంచనాలే ఉన్నాయి.ఇంతకు ముందు వీరి కాంబినేషన్ లో సింహ, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి.

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి పోయిన పేరును తిరిగి సంపాదించుకోవాలని బోయపాటి తాపత్రయ పడుతున్నాడు.

ఈ సినిమాలో కూడా బాలయ్య పవర్ ఫుల్ రోల్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నాడు.ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాను మే 28 న విడుదల చేయాలనీ అనుకున్న కరోనా కారణంగా వాయిదా వేశారు.

Telugu Boyapati Srinu, Boyapati Srinu Next Movie With Ravi Teja, Ravi Teja, Social Media-Latest News - Telugu

అయితే ఈ సినిమా తర్వాత బోయపాటి ఇంత వరకు మరొక సినిమా ప్రకటించలేదు.ఇప్పటికే చాలా మంది పేర్లు వినిపించిన అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటించలేదు.తాజాగా బోయపాటి నెక్స్ట్ సినిమా మాస్ మహారాజ రవితేజ తో తీయబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు ఈ సినిమాని ఒక ప్రముఖ నిర్మాత నిర్మించబోతున్నారని వచ్చే ఏడాది ఈ సినిమా మొదలు పెట్టె అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

బోయపాటి రవితేజ కోసం ఒక పవర్ ఫుల్ స్టోరీ కూడా సిద్ధం చేసే పనిలో ఉన్నట్టు టాక్.చూడాలి మరి రవితేజ తో అయినా సినిమా వర్క్ అవుట్ అవుతుందో లేదో.

#Boyapati Srinu #BoyapatiSrinu #Social Media #Ravi Teja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు