చిరుకు రెస్ట్‌ ఇవ్వని చరణ్‌.. బ్యాక్‌ టు బ్యాక్‌ మూవీస్‌

మెగాస్టార్‌ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం.150 చిత్రం విడుదలై చాలా కాలం అయ్యింది.అయినా ఇప్పటి వరకు 151వ చిత్రంను విడుదల చేయలేదు.భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే.రికార్డు స్థాయిలో అంచనాలున్న ఈ చిత్రం ను వచ్చే సమ్మర్‌లో విడుదల చేయబోతున్నారు.చిరు 151వ చిత్రానికి జరిగిన ఆలస్యంను 152 మరియు 153వ చిత్రాలకు జరగకుండా చూడాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 Boyapati Srinu Next Movie With Megastar Chiranjeevi-TeluguStop.com

చిరంజీవి 152వ చిత్రం ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో కన్ఫర్మ్‌ అయ్యింది.భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఆ చిత్రంను వచ్చే నెల లేదా జనవరిలో పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.చిరంజీవి 152వ చిత్రం దసరా కానుకగా రావడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.ఇక చిరంజీవి 153వ చిత్రం గురించి అప్పుడే చర్చ జరుగుతుంది.

చిరు హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కే అవకాశం ఉందని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది.

చిరంజీవి 151వ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాల్సి ఉంది.కాని కొన్ని కారణాల వల్ల సినిమాను ఆలస్యం చేస్తూ వచ్చారు.దాంతో బోయపాటి మరో ప్రాజెక్ట్‌లు చేస్తున్నాడు.

ఇప్పుడు చిరంజీవి 153వ చిత్రానికి బోయపాటి దర్శకత్వం వహించే ఛాన్స్‌ దక్కింది.వచ్చే వేసవి తర్వాత చిరంజీవి, బోయపాటిల మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.చిరు, బోయపాటిల కాంబో మూవీని అల్లు అరవింద్‌ మరియు చరణ్‌ లు కలిసి నిర్మించనున్నట్లుగా తెలుస్తోంది.2020 సంక్రాంతికి చిరు, బోయపాటిల కాంబో మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube