అఖండ తర్వాత నందమూరి హీరోతోనే బోయపాటి సినిమా

బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ మూవీ అంటే ఎంత హైప్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలవడంతో పాటు బాలకృష్ణ కెరియర్ లో కూడా బెస్ట్ మూవీస్ గా నిలిచిపోయాయి.

 Boyapati Srinu Next Movie With Kalyan Ram, Tollywood, Telugu Cinema, South Cinem-TeluguStop.com

ఇప్పుడు వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా అఖండ తెరకెక్కుతుంది.ఈ సినిమాని కూడా హై వోల్టేజ్ యాక్షన్ తోనే బోయపాటి ఆవిష్కరిస్తున్నాడు.

ఇందులో కూడా బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు.అందులో ఒక పాత్రలో అఘోరా తరహాలో మహాశివుడు ఉపాషకుడుగా కనిపిస్తూ ఉండగా మరో పాత్ర యంగ్ లుక్ లో ఉంది.

తాజాగా ఉగాది రోజున ఈ సినిమా టైటిల్ తో పాటు బాలకృష్ణ అఘోర పాత్ర టీజర్ ని బోయపాటి ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చి సినిమా మీద అంచనాలు పెంచేశాడు.ఇప్పటికే మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే బోయపాటి ఈ అఖండ మూవీ తర్వాత చేయబోయే సినిమా గురించి అప్పుడే టాలీవుడ్ లో చర్చ మొదలైంది.

యాక్షన్ డైరెక్టర్ తన నెక్స్ట్ సినిమాని కూడా నందమూరి హీరోతోనే ప్లాన్ చేసుకున్నాడు.

ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్‌తో తెరకెక్కించనున్నాడు.ఇప్పటికే కళ్యాణ్‌ రామ్‌కు కథ వినిపించిన బోయపాటి శ్రీను ఓకే చేయించుకున్నాడు.

గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపుల్లో ఉన్న కళ్యాణ్‌ రామ్‌కు బోయపాటి శ్రీను వంటి మాస్ దర్శకుడుతో సినిమా చేస్తే అడ్వాంటేజ్ ఉంటుంది.ఈ నేపధ్యంలో కళ్యాణ్ రామ్ కూడా బోయపాటితో సినిమాపై చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రాజేంద్ర అనే దర్శకుడితో సినిమా చేస్తున్నాడు.దాంతో పాటు నవీన్ మేడారం దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు.

వీటితో పాటు తన సొంత ప్రొడక్షన్ లో వేణు మల్లిడి దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ సినిమా చేస్తున్నాడు.వీటిని కంప్లీట్ చేసి బోయపాటి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube