అఖండ హిట్ అయితే అప్పుడు చూద్దాం అంటున్న హీరోలు..!

బోయపాటి శ్రీను అంటే అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన తీసే యాక్షన్ సినిమాలు.భద్ర సినిమా తో తన జర్నీ మొదలుపెట్టి తన కెరీర్ లో చాలా సూపర్ హిట్ సినిమాలు తీసాడు.

 Boyapati Srinu Next Movie Update-TeluguStop.com

ఆయన కెరీర్ లో సూపర్ హిట్ సినిమాలు మాత్రమే కాదు అట్టర్ ప్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి.అందుకే ఆయన సినిమాలు అంటే ముందుగా స్టార్ హీరోలు భయపడతారు.

హిట్ వస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ప్లాప్ వచ్చిన అదే రేంజ్ లో ఉంటుంది.రామ్ చరణ్ తో తీసిన వినయ విధేయ రామ తో బోయపాటి శ్రీను కు పెద్ద దెబ్బ తగిలింది.

 Boyapati Srinu Next Movie Update-అఖండ హిట్ అయితే అప్పుడు చూద్దాం అంటున్న హీరోలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాతో రామ్ చరణ్ కూడా చాలా అప్సెట్ అయ్యాడు.ప్రస్తుతం బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ తో అఖండ సినిమా చేస్తున్నాడు.బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు పీక్స్ లో ఉంటాయి.

ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ సినిమాలు హిట్ అయ్యాయి.

ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదల అయ్యి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి పోయిన పేరును తిరిగి సంపాదించుకోవాలని బోయపాటి తాపత్రయ పడుతున్నాడు.

Telugu Action Movies, Akhanda, Allu Arjun, Balakrishna, Bhadra, Boyapati Latest Movie, Boyapati Next Movie Heroes, Boyapati Srinu, Boyapati Srinu Next Movie Update, Ram Charan, Ravi Teja, Vinaya Vidheya Rama-Movie

అయితే ఈ సినిమా తర్వాత బోయపాటి ఇంత వరకు మరొక సినిమా ప్రకటించలేదు.

ఇప్పటికే అల్లు అర్జున్, రవి తేజ పేర్లు వినిపిస్తున్నాయి.అయితే బోయపాటి ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్నాడు కాబట్టి అఖండ సినిమా హిట్ అయితేనే నెక్స్ట్ సినిమా ఓకే అయ్యేట్టు ఉంది.ఇప్పటికే కథ చెప్పి వీరిద్దరిలో ఎవరో ఒకరిని ఒప్పించే పనిలో ఉన్నాడట.

ఆ కథ విని వీరిద్దరూ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన చెప్పలేదట.అలాని నో కూడా చెప్పలేదట.

కానీ అఖండ సినిమా హిట్ అయితే మాత్రం బోయపాటికి పిలిచి మరి అవకాశం ఇచ్చే సూచనలు ఉన్నాయి.కాబట్టి అఖండ హిట్ వరకు వేచి చూడాల్సిందే.

#Akhanda #Ram Charan #Bhadra #Action Movies #BoyapatiSrinu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు