ఆ విషయంలో రాజమౌళి కంటే బోయపాటి గ్రేట్?

Boyapati Srinu Achieves Rare Record With Sarainodu Jaya Janaki Nayaka Movies, Boyapati Srinu , Jaya Janaki Nayaka Movie, Sarrainodu, Rajamouli Youtube

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ల జాబితాను పరిశీలిస్తే అందులో రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను, సుకుమార్, అనిల్ రావిపూడి ముందువరసలో ఉంటారు.వరుస సక్సెస్ లు ఇచ్చిన దర్శకుడిగా రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.

 Boyapati Srinu Achieves Rare Record With Sarainodu Jaya Janaki Nayaka Movies, Bo-TeluguStop.com

పక్కా మాస్ మసాలా సినిమాలు మాత్రమే తీసే బోయపాటికి రాజమౌళి స్థాయి గుర్తింపు లేకపోయినా ఫ్యాన్స్ కు విందు భోజనం లాంటి సినిమాలు తీస్తాడనే పేరు మాత్రం ఉంది.

అయితే ఒక విషయంలో మాత్రం రాజమౌళితో పోలిస్తే బోయపాటి శ్రీనునే గ్రేట్ అని ఆయన అభిమానులు చెబుతున్నారు.

రాజమౌళి సొంతం చేసుకోలేని రికార్డులను సైతం బోయపాటి సొంతం చేసుకుంటున్నాడని తెలుపుతున్నారు.రాజమౌళికి కూడా సాధ్యం కాని రికార్డును బోయపాటి సొంతం చేసుకోవడంతో ఆయన అభిమానులు ఈ కామెంట్లు చేస్తున్నారు.

భద్ర సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టిన బోయపాటి సినిమా సినిమాకు దర్శకుడిగా తన స్థాయిని పెంచుకుంటున్నారు.

బోయపాటి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సరైనోడు, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన జయజానకి జానక సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.

అయితే ఈ సినిమాలు తెలుగులోనే కాదు హిందీ యూట్యూబ్ లోను బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు రెండు సినిమాలు వేర్వేరుగా 300 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకున్నాయి.సరైనోడు సినిమా సరైనోడు పేరుతోనే డబ్బింగ్ కాగా జయ జానకి నాయక సినిమా జయ జానకి నాయక కూంకర్ పేరుతో యూట్యూబ్ లో విడుదలైంది.

రాజమౌళి మాత్రమే కాదు దేశంలో బోయపాటి మినహా మరే దర్శకుడికి ఈ రికార్డు లేదు.300 మిలియన్స్ వ్యూస్ వేర్వేరుగా సాధించిన ఈ రెండు చిత్రాలలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ కావడం గమనార్హం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube