టీడీపీ యాడ్స్‌తో దుమ్ము రేపుతున్న బోయపాటి... త్వరలో రాబోతున్న యాడ్‌ రచ్చే  

Boyapati Srinu Directed Tdp Ads Archives-

తెలుగు దేశం పార్టీకి చెందిన యాడ్స్‌ గత కొన్ని రోజులుగా అన్ని టీవీ ఛానెల్స్‌లో రచ్చ చేస్తున్నాయి.పలు సంక్షేమ పథకాల గురించిన యాడ్స్‌తో బుల్లి తెరను ముంచేస్తున్నారు.ఆ యాడ్స్‌లో ఎక్కువ శాతం ఆసక్తికరంగా సాగాయి.బుల్లి తెర యాడ్స్‌ కూడా ఇంత క్వాలిటీగా, మంచి రీ రికార్డింగ్‌తో ఉండటంను అంతా కూడా ఆశ్చర్యంకు గురి చేసింది.

Boyapati Srinu Directed Tdp Ads Archives--Boyapati Srinu Directed Tdp Ads Archives-

అయితే ఆ యాడ్స్‌ బోయపాటి చేయడం వల్ల అంత క్వాలిటీగా ఉన్నాయని ఆ తర్వాత వెళ్లడయ్యింది.బోయపాటి సినిమాల స్థాయిలో యాడ్స్‌ను చిత్రీకరించాడు.

Boyapati Srinu Directed Tdp Ads Archives--Boyapati Srinu Directed Tdp Ads Archives-

ఇప్పటి వరకు చేసిన అన్ని యాడ్స్‌ కూడా తెలుగు దేశం పార్టీ ప్రవేశ పెట్టిన పథకాల గురించి ప్రజలు ఆలోచించేలా చేస్తుంది.

ప్రతి ఒక్కరు కూడా నిజమే కదా, తెలుగు దేశం పార్టీ చాలా చేసింది, తప్పకుండా మరోసారి తెలుగు దేశం పార్టీకి అవకాశం ఇస్తే ఏంటీ అన్నట్లుగా ఆలోచిస్తున్నారు.అలాంటి ఆలోచన కలిగేలా చేసిన బోయపాటి శ్రీనివాస్‌ నిజంగా అభినందనీయుడు అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు అంటున్నారు.

ఇక ఇదే సమయంలో మరో యాడ్‌ను త్వరలో వదల బోతున్నారాట.ఆ యాడ్‌ ప్రతి తెలుగు వాడి హృదయంను కదిలించేదిగా ఉంటుందని అంటున్నారు.

ఆ యాడ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి ఇచ్చిన హామీ ఏంటీ, దాన్ని నిలబెట్టుకోకుండా ఎలా మోసం చేశాడు, ప్రధాని మోడీతో చంద్రబాబు ఎలా యుద్దం చేశాడు అనే విషయాలను చూపిస్తూ యాడ్‌ సాగుతుందట.దాదాపు రెండు నిమిషాలు ఉండే ఆ యాడ్‌ ఎన్నికలు వారం రోజులు ఉండగా ప్రసారం చేయబోతున్నారు.ఎన్నికల ప్రచారం సమయంలో ఆ యాడ్‌ ప్రతి ఒక్క ఏపీ ఓటరును ఆలోచింపజేసే విధంగా ఉంటుందని తెలుగు దేశం పార్టీ నాయకులు అంటున్నారు.

ఆ యాడ్‌తో ఒక్కసారిగా పరిస్థితి మారిపోతుందని అంతా అంటున్నారు.