తెలుగు దేశం కోసం చేసిన యాడ్స్‌కు బోయపాటి ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుసా?  

Boyapati Srinivas Remuneration For Telugu Desam Ads -

తెలుగు దేశం పార్టీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను, చేసిన అభివృద్దిని వివరిస్తూ చాలా యాడ్స్‌ వచ్చాయి.గత నెల రోజులుగా టీవీల్లో మారు మ్రోగి పోయాయి.

Boyapati Srinivas Remuneration For Telugu Desam Ads

తెలుగు దేశం పార్టీ యాడ్స్‌ ఆ పార్టీపై జనాల్లో ఆసక్తి కలిగేలా చేసిందే టాక్‌ కూడా వస్తుంది.క్వాలిటీ మరియు కంటెంట్‌ పరంగం టీడీపీ యాడ్స్‌ సినిమాల స్థాయిలో ఉన్నాయి అంటూ అంతా అనుకున్నారు.

అలాంటి యాడ్స్‌ను చేసింది మరెవ్వరో కాదు బోయపాటి శ్రీను.ఆయన దర్శకత్వంలో ప్రతి ఒక్క యాడ్‌ కూడా సినిమా స్థాయిలో రూపొందింది.

తెలుగు దేశం కోసం చేసిన యాడ్స్‌కు బోయపాటి ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుసా-Movie-Telugu Tollywood Photo Image

టీడీపీకి సంబంధించిన ప్రతి యాడ్‌ రూపకల్పనకు బోయపాటి ప్రత్యేక శ్రద్ద తీసుకుని రూపొందించాడు.టీడీపీతో బోయపాటి కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం యాడ్స్‌ మొత్తం నిర్వహణ ఆయనే.అంటే నటీనటుల, ఇతర విషయాలు అన్ని కలిపి బోయపాటి చూసుకోవాల్సి ఉంటుంది.ఇందుకోసం టీడీపీ 5 కోట్ల రూపాయలను బోయపాటికి ఒప్పందంను అధికారికంగా కుదుర్చుకుంది.అయితే అనధికారికంగా మరో పది కోట్ల వరకు బోయపాటికి ముట్టినట్లుగా తెలుస్తోంది.

నెల రోజుల పాటు టీడీపీ కోసం ఎన్నో యాడ్స్‌ను డిజైన్‌ చేయించినందుకు, యాడ్స్‌ షూట్‌ చేసినందుకు గాను బోయపాటి శ్రీను 15 కోట్ల రూపాయలతో పాటు, అధికారంలోకి వచ్చిన తర్వాత లాభంను కూడా పొందేలా అనధికారిక ఒప్పందం చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.మొత్తానికి ఒక సినిమాను తీస్తే బోయపాటికి పది నుండి 12 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది.కాని టీడీపీకి యాడ్స్‌ చేయడం వల్ల అంతకు మించిన డబ్బులు వచ్చాయి.

బోయపాటి నెల రోజుల్లోనే 15 కోట్ల రూపాయలు సంపాదించాడు అంటూ టాక్‌ వినిపిస్తుంది.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Boyapati Srinivas Remuneration For Telugu Desam Ads- Related....